నంద‌మూరి న‌ట `సింహం` బాల‌కృష్ణ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అభిమానుల గుండెల్లో బాలయ్యగా, యువరత్నగా పేరు తెచ్చుకున్నారు బాలకృష్ణ.. అటు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో.. ఇటు రాజ‌కీయాల్లోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన `తాతమ్మ కల` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన‌ బాలకృష్ణ.. ఆ త‌ర్వాత ఇండస్ట్రీలో తన సినిమాలతో ఎన్నో రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ బొనాంజా అనిపించుకున్నాడు.

 

ఇక బాలకృష్ణ త‌న సినీ కెరీర్‌లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లోనూ న‌టించి బాక్సాఫిస్‌ను షేక్ చేశారు. అయితే ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా.. అంద‌రితోనూ బాల‌య్య ఎంతో స‌ర‌ద‌గా ఉంటారు. కానీ, అంద‌రికీ బాలకృష్ణ అంటే ఎంత ప్రేమ ఉంటుందో, అంతే భయం కూడా ఉంటుంది. అలాంటి బాల‌య్య తండ్రి ఎన్టీఆర్ త‌ర్వాత ఓ వ్య‌క్తికి బాగా భ‌య‌ప‌డ‌తార‌ట‌. ఇది ఎవ‌రో చెప్పింది కాదు.. స్వ‌యంగా బాల‌య్య‌నే చెప్పారు. ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవరో కాదు.. బాల‌య్య కుమార్తె నారా బ్రహ్మణి. దీని గురించి బాల‌య్య తాజాగా మాట్లాడుతూ.. నా తండ్రి ఎన్టీఆర్‌గారి త‌ర్వాత బ్ర‌హ్మిణి అంటే భ‌య‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చారు. 

 

తను చాలా బ్యాలెన్స్‌డ్‌. ఏ విషయాన్నైనా చాలా కూల్‌గా చెబుతుంది. ఆమె వల్లే నాకు సహనం అలవడింది. తను ఏం చెప్పినా వింటా. తను లేకపోతే మా మనవడితో కలిసి అల్లరి చేస్తా. వాడికి కూడా వాళ్లమ్మ అంటే చాలా భయం అంటూ చెప్పుకొచ్చాడు బాల‌య్య‌. కాగా, సుదీర్ఘ కాలంగా స్టార్‌ హీరోగా నిలిచి ఇప్పటికి కూడా స్టార్‌ హీరోగానే వెలుగు వెలుగుతున్న బాలకృష్ణ.. నేడు 60వ పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ప్రతి ఏటా ఆయన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్వయంగా బాలయ్యకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపేవారు. అయితే ఈసారి కరోనా వైరస్ మ‌హ‌మ్మారి వ‌ల్ల అలాంటి ప‌రిస్థితి లేదు. దీంతో ఎక్క‌డివారు అక్క‌డే బాల‌య్య పుట్టిన రోజు వేడుక‌లు జ‌రుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: