తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ హీరో గా నిలిచిన తమిళ హీరో సూర్య పాపులారిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గజిని సినిమాలో సంజయ్ రామస్వామి పాత్రలో కనిపించిన సూర్య అందానికి తమిళ, తెలుగు ప్రేక్షకులను ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. వీడొక్కడే, ఘటికుడు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాల్లో హీరో సూర్య నటనకు దక్షిణ భారత దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు అయ్యారు. 2016 వ సంవత్సరంలో విడుదలైన 24 సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన సూర్య నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిపోయి తెగ ప్రశంసలు కురిపించారు.


కమలహాసన్ తర్వాత సూర్య మాత్రమే పలురకాల వేషాలలో అద్భుతంగా నటించగలడని సినీ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. రజనీకాంత్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యంత పాపులారిటీ సంపాదించిన సూర్య సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సూపర్ డూపర్ గా ఆడతాయి అని చెప్పుకోవచ్చు. తమిళనాడు తో సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తాయి. అతడి సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగానే చూస్తారు. 

 

ఇకపోతే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలను మినహాయించి ఒరిస్సా, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ కి వీర అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అతని చిత్రాలు హిందీలో డబ్ కాబడి యూట్యూబ్ లో పెద్ద సంచలనమైన విషయం తెలిసిందే. ఇంత క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, సూర్య కలిసి ఏదైనా ఒక సినిమాలో నటిస్తే కోట్ల మంది అభిమానులు పండగ చేసుకుంటారని చెప్పుకోవచ్చు. సూర్య నటనకు, ఎనర్జిటిక్ స్టార్ అల్లు అర్జున్ డాన్స్ లకు అభిమానులు ఫిదా అవుతారు. వీళ్ళిద్దరి సినిమాకి ఎక్కువగా అమ్మాయిలు వస్తారు అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా భవిష్యత్తులో అల్లు అర్జున్ సూర్య కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుందేమో చూడాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి: