అల్లరి ఎంత బాగ చేస్తే.. హీరోయిన్స్ కు అంత పేరొస్తుంది. అల్లరి.. చిలిపితనం రెండూ కలిసుంటే.. ప్రేక్షకులకే కాదు.. హీరోలకు కూడా బాగా నచ్చేస్తారు. కన్నడ బ్యూటీ రష్మిక కూడా ఇలాగే ఓ తమిళ స్టార్ దృష్టిలో పడి బంపర్ ఆఫర్ కొట్టేసిందట. 

 

ఛలో.. గీత గోవిందం లాంటి వరుస హిట్స్ తో రష్మిక తెలుగులో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. మధ్యలో గీత గోవిందం.. దేవదాస్ నిరాశ పరిచినా.. సరిలేరు నీకెవ్వరు.. భీష్మ లాంటి వరుస హిట్స్ తో ఫామ్ లోకి రావడమే కాదు.. తమిళంలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. 

 

రష్మిక సుల్తాన్ మూవీతో తమిళంలోకి అడుగుపెట్టింది. కార్తీతో జతకట్టిన ఈ చిత్రం.. కరోనా కారణంగా రిలీజ్ కు నోచుకోలేదు. కన్నడలో నటిస్తున్న పొగరు మూవీ షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం తెలుగులో పుష్ప సెట్స్ పై ఉండగా.. ఇంతవరకు షూటింగ్ లో జాయిన్ కాలేదు. ఈ లోగా.. తమిళంలో విజయ్ తో నటించే ఛాన్స్ అందుకుంది రష్మిక. గిల్లీ వంటి హిట్ తర్వాత విజయ్, దర్శకుడు ధరణి కాంబినేషన్ హిట్ రిపీట్ కానుంది. ఇందులో హీరోయిన్ గా రష్మిక పేరు పరిశీలిస్తున్నారట. 

 

విజయ్ పక్కన రష్మిక సెలక్ట్ అయితే మాత్రం.. ఆ క్రెడిట్ సరిలేరు నీకెవ్వరు సినిమాకే చెందుతుంది. ఇందులో రష్మిక చేసిన అల్లరి చిత్ర యూనిట్ కు బాగా నచ్చిందట. పెళ్లి చేసుకొమ్మని మహేశ్ వెంటపడుతూ ఆటపట్టించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలాంటి పాత్రే విజయ్ సినిమాలో ఉండటంతో.. రష్మిక బాగుందన్న థాట్ లో చిత్రవర్గాలు ఉన్నాయట. మొత్తానికి కన్నడ బ్యూటీ రష్మిక వరుస ఆఫర్లు అందుకుంటూ తోటి హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. చలాకీతనం.. ఆకట్టుకునే నవ్వు.. అందమైన రూపం అన్నీ కలగలిసి ఉండటంతో.. అవకాశాలు ఈ ముద్దుగుమ్మను వెతుక్కుంటూ వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: