టాలీవుడ్ సినిమా పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప సంగీత దర్శకుల్లో స్వరవాణి కీరవాణి ఒకరు అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన కీరవాణి సినిమాల్లోని సంగీతం ఎంతో శ్రావ్యంగా ఉండడంతో పాటు తెలుగుదనాన్ని తట్టి లేపినట్లు అనిపిస్తుంది అనే వారు ఎందరో ఉన్నారు. ఇకపోతే ఆయన సంగీత ఝరి నుండి జాలువారిన అద్భుతమైన పాటల్లో ఎన్నో పాటలు మంచి పేరు దక్కించుకోగా, మరీ ముఖ్యంగా కొన్ని మాత్రం అప్పటికీ, ఇప్పటికే, అలానే ఎప్పటికీ కూడా శ్రోతల మనస్సులో నిలిచిపోతాయి.  

IHG

కాగా ఆ విధంగా సంగీత ప్రియుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే కీరవాణి పాటల్లో ఒకటి మాతృదేవోభవ సినిమాలోని రాలిపోయే పువ్వనీకు రాగాలెందుకే సాంగ్. 1993లో కె అజయ్ కుమార్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ఎంతో పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు ఇందులోని పాటలు కూడా ప్రేక్షకుల మదిని తాకాయి. మాధవి ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో నాజర్ ఆమె భర్తగా నటించారు. ఇక ఈ సాంగ్ ని అందరి మనసులు కదిలించేలా రాశారు వేటూరి సుందరరామమూర్తి. 

 

మనిషి యొక్క జీవితం, బాధలు, బంధాలు, అనుబంధాలు, వంటి పలు అంశాల మేళవింపుగా జీవితసారం గురించి ఎంతో గొప్పగా రాయబడిన ఈ పాట కేవలం ఆడియో పరంగానే కాక, విజువల్ గా కూడా ప్రేక్షకుల కంటతడి పెట్టించకమానదు. ఎంతో హృద్యంగా సాగె ఈ పాటలో నటి మాధవి ఎంతో గొప్ప సహజత్వ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. వాస్తవానికి ఈ సినిమాలోని పాటలన్ని కూడా కూడా సూపర్ హిట్ అని, తాను కెరీర్ లో సంగీతం అందించిన సినిమాల్లో మాతృదేవోభవ ఒకింత ప్రత్యేకం అని ఎప్పుడూ చెప్తుంటారు కీరవాణి. ఆ విధంగా ఈ సినిమాలోని ఆ పాట ఎప్పటికీ మన మనస్సులో గుర్తుండిపోతుంది....!!  

 

మరింత సమాచారం తెలుసుకోండి: