నందమూరి వారసుడు హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ఈరోజు తన 42 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడే నటనా ప్రస్థానం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. అమెరికాలోని చికాగో లో టెక్నాలజీ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన కళ్యాణ్ రామ్ అక్కడే ఉద్యోగం సంపాదించే ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. పెద్ద చదువులు చదివి ఉద్యోగం సంపాదించినా కళ్యాణ్ రామ్ లో ఏదో లోటు ఉండేది. అతనికి సినిమాల్లో హీరోగా కనిపించాలన్న తపన ఎక్కువగా ఉండేది. ఒకరోజు తల్లి లక్ష్మి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కళ్యాణ్ రామ్ కి ఫోన్ చేసి తమ్ముడు తారక్ సినిమాల్లో హీరోగా దూసుకెళ్తుంటే అమెరికాలో ఎవరో కింద ఉద్యోగం చేస్తున్నావేంట్రా, భారతదేశానికి తిరిగి వచ్చాయి హీరో అని చెప్పింది.


దీంతో అతని ఆశలు ఇంకా పెరిగిపోయి వెనువెంటనే భారతదేశానికి తిరిగి వచ్చేసే తన తండ్రికి తాను హీరో కావాలనుకుంటున్నాను అని చెప్పాడు. కానీ  హరికృష్ణ మాత్రం తన సొంత అనుభవం తో కొడుక్కి సినిమారంగంలోని మంచిచెడ్డలు చెప్పాడు. ఒక సినిమా హిట్ అయిందని పొంగి పోకూడదని ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా కృంగిపోకూడదని...  అటువంటి శక్తి ఉంటేనే సినీ పరిశ్రమలో అరంగేట్రం చేయాలని కళ్యాణ్ రామ్ కి హెచ్చరించాడు హరికృష్ణ. అయితే హీరో కావాలన్న ఆశ అతడిని సినీ పరిశ్రమ వైపు పరుగులు పెట్టించింది. కొడుకు కోరిక మేరకు హరికృష్ణ రామోజీరావు,  అశ్వినీదత్ లను కలసి తన కళ్యాణ్ రామ్ సినిమా హీరో అవ్వాలి అనుకుంటున్నాడని చెప్పాడు.


తదనంతరం వీళ్ళిద్దరి సహాయంతో ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో ఎనమల కాశీ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి చూపులు సినిమా లో, అలాగే మల్లికార్జున దర్శకత్వంలో అశ్వినీదత్ తీస్తున్న అభిమన్యు సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ ఒకేసారి నటించడం ప్రారంభించాడు. అయితే రెండు అతి పెద్ద బ్యానర్లలో నిర్మించబడిన 2003 అక్టోబర్ నెలలో తొలి చూపులు సినిమా, అదే సంవత్సరం నవంబర్ నెలలో అభిమన్యు సినిమా విడుదలయ్యాయి కానీ బాక్సాఫీసు వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలవడంతో కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ అపజయాలు తట్టుకోలేని కళ్యాణ్ రామ్ ఒక గదిలో ఒంటరిగా ఉంటూ చాలా బాధ పడేవాడు. అప్పట్లో హరికృష్ణ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నప్పటికీ కళ్యాణ రాముని కలిసి దిగులు పడవద్దు అని చెప్పి ప్రోత్సహించేవాడు. దీంతో కష్టపడితేనే ఫలితం దక్కుతుందన్న తాతగారి మాటలను గుర్తు తెచ్చుకొని, తండ్రి మాటలను గుండెల్లో పెట్టుకొని మళ్లీ సినిమాల్లో తన సత్తా చూపేందుకు సిద్ధపడ్డాడు.


కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాలకోసం స్క్రిప్ట్ లను వింటున్నాడని తెలుసుకున్న సురేందర్ రెడ్డి అతని వద్దకు వచ్చి అతనొక్కడే సినిమా స్క్రిప్ట్ ని ఒక పదిహేను నిమిషాల పాటు వినిపించాడు. కథ నచ్చిన వెంటనే కళ్యాణ్ రామ్ ఓకే చెప్పేసి నటించేందుకు సిద్దమయ్యాడు. కానీ ఈ సినిమా నిర్మించేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో కళ్యాణ్ రామ్ ప్రతి నిర్మాత ఇంటికి వెళ్లి మంచి కథతో సినిమా చేయబోతున్నానని, ప్రొడ్యూస్ చేస్తారా అని అడిగేవాడు. కానీ ప్రతి ఒక్కరు కళ్యాణ్ రామ్ నందమూరి వారసుడు అని రాచమర్యాదలు చేశారు కానీ సినిమా నిర్మించేందుకు మాత్రం ఆసక్తి చూపలేదు.


ఎట్టకేలకు ఇద్దరు నిర్మాతలు సినిమాకి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు కానీ రెండు అట్టర్ ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న కళ్యాణ్ పై కేవలం రెండు కోట్లు మాత్రమే పెట్టగలమని తేల్చి చెప్పేశారు. అతనొక్కడే సినిమా పూర్తి కావాలంటే కనీసం 3 నుంచి మూడున్నర కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. దీంతో కళ్యాణ్ రామ్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ అనే పేరుతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి అతనొక్కడే సినిమా ని తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి పది రెట్లు ఎక్కువ డబ్బులు రావడంతో సినిమా తీసేందుకు నిరాకరించిన నిర్మాతలంతా తల పట్టుకున్నారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ కళ్యాణ్ రామ్ కి నిరాశనే మిగిల్చాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పటాస్ చిత్రం కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లో మరో అతి పెద్ద హిట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: