ఎందుకంటే తమ ఫేవరెట్ హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వస్తాయని వేయికళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళకి లాక్ డౌన్ తో నిరాశ ఎదురైంది అని చెప్పాలి. అయితే కరెక్ట్ గా లాక్డౌన్ అమలు అయ్యే సమయానికి తెలుగు ప్రేక్షకులందరికీ ఎన్నో అంచనాలు పెంచేసిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ వచ్చింది. అదే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ బర్త్ డే రోజున మార్చి 27వ తేదీన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఫస్ట్ లుక్ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ఊపిరి నింపింది అనే చెప్పాలి. సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్.. సంబంధించి ఈ ఫస్ట్ లుక్ లో కనిపించి..తెలుగోడి పౌరుషం గుర్తుచేసి తెలుగు ప్రేక్షకులందరికి రక్తాన్ని మరిగించింది . లాక్డౌన్ సమయంలో అందరికీ మరోసారి అల్లూరి సీతారామరాజును గుర్తుచేసింది ఫస్ట్ లుక్. ఇక రామ్ చరణ్ ఫస్ట్ లుక్ విడుదలై ఒక రేంజ్లో హిట్ అవ్వడంతో ఆ తర్వాత నందమూరి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఏ రేంజిలో ఉండబోతుంది అని ఎన్నో అంచనాలు పెంచుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు మే 20వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని అందరూ అనుకొన్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఫస్ట్ లుక్ పై అంచనాలు పెంచుకున్న వారికి నిరాశ ఎదురైంది అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాలేదు.
Powered by Froala Editor