రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్స్ గా, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా తెరకెక్కిన సినిమా బాహుబలి. సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ఈ సినిమాతో జాతీయ స్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దర్శకుడు రాజమౌళి. అప్పటి వరకు బాహుబలి రేంజ్ భారీ బడ్జెట్ సినిమా టాలీవుడ్ లో రాకపోవడంతో ఈ సినిమా ప్రారంభం నుండే ప్రేక్షకులు, అభిమానులు దీనిపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. 

IHG

అయితే అప్పట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తరువాత సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇక ఆ తరువాత రిలీజ్ అయిన ట్రైలర్, సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు సృష్టించింది. భారీ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్, కళ్ళు అబ్బురపరిచే సెట్టింగ్స్, యాక్షన్ సీన్స్, సాంగ్స్, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వంటివి ఈ సినిమా ట్రైలర్ లోని ప్రత్యేకతలు. అప్పట్లో బాహుబలి ట్రైలర్, యూట్యూబ్ లో ఒక సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి భారీ స్థాయిలో వ్యూస్, లైక్స్ అందుకుంది. 

 

ఇక రిలీజ్ తరువాత సినిమా కూడా అందరి అంచనాలు అందుకోవడం, ఎవరూ ఊహించని స్థాయిలో వందల కోట్ల కలెక్షన్ ని అందుకోవడంతో తెలుగు సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక అక్కడి నుండి టాలీవుడ్ గురించి ఎవరు మాట్లాడాలన్నా, బాహుబలికి ముందు, అలానే బాహుబలికి తరువాత అనేంతలా ఈ సినిమా ప్రేక్షకుల్లో, టాలీవుడ్ పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఆ తరువాత, దీనికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి 2 కూడా దీనిని మించేలా మరింత అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: