‘ఆర్ ఎక్స్ 100’ మూవీ ఘన విజయం తరువాత ఈమూవీ హీరో కార్తికేయ హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ దర్శకుడు అజయ్ భూపతి లకు చాలామంచి కెరియర్ వస్తుందని అందరు భావించారు. అయితే ఈమూవీ తరువాత కార్తికేయకు అలాగే పాయల్ కు వరస పరాజయాలు ఎదురౌతుంటే దర్శకుడు అజయ్ భూపతికి కనీసం తన రెండవ సినిమా తీసే అవకాశం కూడ ఇప్పటి వరకు రాలేదు.


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కార్తికేయకు అదేవిధంగా ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ ఫెమ్ జొన్నలగడ్డ సిద్ధుకు ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి వస్తున్న పిలుపు కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ‘బిగ్ బాస్’ సీజన్ 4 లో హౌస్ మేట్స్ గా ఎంపిక అయ్యే అవకాశం వీరిద్దరికీ వచ్చినా ఈ ఆఫర్ ను తిరస్కరించలేక అదేవిధంగా పూర్తిగా అంగీకరించలేని పరిస్థితులలో ప్రస్తుతం వీరిద్దరు ఉన్నట్లు టాక్.


ప్రస్థుత కరోనా పరిస్థితుల రీత్యా తిరిగి షూటింగ్ లు ప్రారంభం కావడం ఎప్పుడో ఎవరికీ తెలియని ప్రశ్నగా మారడంతో వీరిద్దరికీ సినిమాలకు సంబంధించి కొన్ని అవకాశాలు లైన్ లో ఉన్నా అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఖాళీగా ఉండే కంటే ‘బిగ్ బాస్ హౌస్’ లోకి వెళ్ళడం మంచిది అన్న సలహాలు వీరికి వస్తున్నా ఇలాంటి షోలలో పాల్గొనడం ద్వారా తమ ఇమేజ్ కి మరింత డ్యామేజ్ జరుగుతుందని వీరిద్దరి ప్రస్తుత భావన అని అంటున్నారు.


వీరిద్దరూ బిగ్ బాస్ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అధితి అరుణ్ సుధాకర్ కొమకుల లైన్ లో ఉన్నట్లు లీకులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ షోలోకి ఎంటర్ కావడానికి శ్రద్ధా దాస్ రమ్య పసుపులేటి యామిని భాస్కర్ ప్రియ వడ్లమాని హంసానందిని లు కూడా ‘బిగ్ బాస్’ హౌస్’ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: