ప్ర‌పంచ వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ బుల్లితెర షో బిగ్ బాస్ తెలుగులో కూడా ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా మూడు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ పాటికే బిగ్ బాస్ - 4 సీజ‌న్ ప్రారంభం కావాల్సి ఉంది. కాస్త లేట్‌గా అయినా బిగ్ బాస్ సీజన్-4 హంగామా మొదలైపోయింది. స్టార్ మా ఛానెల్ నుంచి అధికారికంగా ప్రకటన రానప్పటికీ.. తెరవెనక నటీనటుల్ని సంప్రదించే కార్యక్రమం అయితే మొద‌లైన‌ట్టు భోగ‌ట్టా..?  ఈ సారి క‌రోనా నేప‌థ్యంలో టీవీ ఛానెల్స్ రేటింగ్ ఘోరంగా ప‌డిపోవ‌డంతో ప్రోగ్రామ్‌కు మ‌రింత ఆక‌ర్ష‌ణీయ‌త‌తో పాటు హంగులు అద్దేందుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు హాట్ హీరోయిన్లు, ఇద్ద‌రు హాట్ యాంకర్ల‌తో పాటు న‌లుగురు హీరోయిన్ల‌ను హౌస్‌లోకి పంపాల‌ని చూస్తున్నార‌ట‌.

 

ఇప్ప‌టికే కొన్ని పేర్లు సోష‌ల్ మీడియాలో కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఇక తాజాగా హీరోల లిస్ట్ విష‌యానికి వ‌స్తే కార్తికేయ, సిద్ధూ జొన్నలగడ్డను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే దానికి వాళ్లు నిరాకరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. రెమ్యున‌రేష‌న్ ఎక్కువ ఇచ్చి అయినా వీరిని షోలోకి తీసుకుంటే క్రేజ్ వ‌స్తుంద‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నార‌ట‌. ఇక అవ‌కాశాలు లేని మ‌రో ఇద్ద‌రు యువ హీరోలు మాత్రం ఈ షోలో పాల్గొనేందుకు ఆస‌క్తి క‌న‌ప‌రిచిన‌ట్టు స‌మాచారం.

 

ఈ లిస్ట్ లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, గరుడవేగ సినిమాలో నటించిన అదిత్ అరుణ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక ఫేడ‌వుట్ అవ్వ‌డంతో పాటు ఛాన్సులు లేకుండా ఖాళీగా ఉన్న న‌లుగురు హీరోయిన్లు, మ‌రో ఇద్ద‌రు హాట్ యాంక‌ర్లు బిగ్ బాస్ - 4 కంటెస్టెంట్ల లిస్టులో ఉన్నార‌ట‌. వీళ్లంతా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే ఈ సారి షో ర‌చ్చ రంబోలాయే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: