సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా చైల్డ్ ఆర్టిస్టుగానే సత్తా చాటిన మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా మొదటి సినిమాతోనే మెప్పించాడు. రాజకుమారుడు నుండి సరిలేరు నీకెవ్వరు వరకు చేసిన 26 సినిమాల్లో ది బెస్ట్ అనిపించుకున్నాడు మహేష్. అంతేకాదు తండ్రి నట వారసత్వాన్ని అందుకుని ఆయన స్క్రీన్ నేమ్ ను కూడా పొందాడు. ప్రిన్స్ మహేష్ కాస్త సూపర్ స్టార్ మహేష్ గా మారేందుకు చాలానే కష్టపడ్డాడు.
ఒక దశలో ఫ్యామిలీ ఇమేజ్ మాత్రమే వచ్చిందనుకున్న మహేష్ కు గుణశేఖర్ తో చేసిన ఒక్కడు సినిమా యూత్ ఆడియెన్స్ తో పాటుగా మాస్ ప్రేక్షకులను మెప్పించింది. ఒక్కడు సినిమా నుండి మహేష్ పొటెన్షియల్ మారిపోయింది. ఆ సినిమాతో స్టార్ లీగ్ లోకి వచ్చిన మహేష్ వరుస హిట్లు కొడుతూ సూపర్ స్టార్ గా ఎదిగాడు. పోకిరి సినిమా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్ని చెరిపేసి సరికొత్త సంచలనాలు సృష్టించింది పోకిరి.
కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే మహేష్ ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్నాడు. అందుకే మహేష్ తో సినిమా తీసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. బాబుతో సినిమా అంటే అది మాములు విషయం కాదు.. అదీను ఇప్పుడు సూపర్ ఫాంలో ఉన్న మహేష్ తో సినిమా కోసం నిర్మాతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. తనకు కంఫర్ట్ అనిపించేలా చేసే ఏ నిర్మాతతో అయినా సినిమాలు చేసే మహేష్ తో కరెక్ట్ సినిమా పడితే మాత్రం రికార్డులు బద్ధలే.. అందుకే నిర్మాతలు కూడా మహేష్ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాదు ఒక్కసారి మహేష్ తో సినిమా చేస్తే మళ్ళీ మళ్ళీ ఆయనతో చేయాలని అనిపించేలా సూపర్ స్టార్ క్రేజ్ ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి