అనేక భాషలలో రిలీజ్ అయ్యి.. సూపర్ హిట్ అయిన చిత్రం దృశ్యం.. దీనిని తెలుగులో విక్టరీ వెంకటేష్ ప్రధాన నాయకుడిగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించిన  రోషన్ బషీర్ తన నటనతో అభిమానులను మెప్పించాడు. ఇప్పుడు ఈ నటుడు ప్రేమలో పడ్డాడు.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ దగ్గర బంధువు అయిన ఫర్జానా తో ప్రేమ లో ఉన్నాడు. ఈనెల 5వ తారీఖున కుటుంబ సభ్యుల సమక్షంలో ఫర్జానా తో నిశ్చితార్థం కార్యక్రమం పూర్తిచేసుకొని.. పెళ్లి పీటలు ఎక్కడానికి మొత్తం కూడా ఫిక్స్ చేశాడు. వచ్చేనెల 5వ తారీఖున ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు. కరోనా ఈ నేపథ్యంలో అతి తక్కువ కుటుంబ సభ్యులు మధ్యలో కేరళలో వివాహం జరగనున్నట్లు తెలియజేశారు.


దృశ్యం సినిమాలో రోషన్ బషీర్ పాత్ర చుట్టూ కధ నడుస్తుంది. అంతే కాకుండా తన పాత్ర ఎంతో క్లిష్టమైన సన్నివేశాల చుట్టూ ఉన్న తన నటనతో అభిమానులను నటించాడు. ప్రతి సీను లోనూ తనదైన శైలిలో నెగిటివ్ అభినయాలతో సినిమా విజయానికి తోడ్పడ్డాడు. తనకు కాబోయే భార్య న్యాయ విద్యను అభ్యసించింది అని సోషల్ మీడియాలో వెల్లడించారు. వీరి పెళ్లి తేదీ ఖరారు అయిన సందర్భంగా నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.

 

దృశ్యం సినిమా కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా శ్రీలంకలో కూడా రీమేక్ చేశారు. ధర్మ యుద్ధ్య అనే పేరుతో అక్కడ సీనీ  ప్రేక్షకుల ముందుకు తీసుకుని వెళ్లారు. రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ గొప్ప విజయం సాధించడం సినీ అభిమానులకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇలా చాలా అరుదుగా జరుగుతుంది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక భాష సూపర్ హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ చేస్తే హిట్టవుతుందని నమ్మకాలు లేవు.. కానీ సినిమాలోని కథనం, పాత్రలు తెరపై సహజంగా కనిపించినప్పుడు ఇలాంటి విజయాలు చేకూరుతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: