హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ బలన్మరణం తర్వాత బాలీవుడ్​లో వివాదాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో బంధుప్రీతిపై కీలక వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్​.. తాాజాగా దర్శకుడు అనురాగ్​ కశ్యప్​పైనా విమర్శలు గుప్పించింది. అనురాగ్​ను "మినీ మహేశ్​ భట్"​ అని సంభోధిస్తూ ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టింది​. అతని కెరీర్​లో తను నటించిన 'క్వీన్'​ సినిమానే పెద్ద హిట్​గా నిలిచిందని పేర్కొంది.గతంలో తనకూ పెద్ద నిర్మాతల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని అనురాగ్​ కశ్యప్​ వెల్లడించారు. అలాంటి సమయంలోనూ కంగనాకు సహాయం చేశానన్నారు.

 

బాలీవుడ్​ నాకు తిండి తెచ్చిపెట్టలేదు. ధర్మ, ఎక్సైల్​ లేదా యాశ్​రాజ్​ ఫిల్మ్స్​ వంటి సంస్థలు నా సినిమాలను నిర్మించడానికి ముందుకు రాలేదు. చివరికి నేను నా స్వంతంగా ఓ నిర్మాణ సంస్థను సృష్టించాను. కంగనాకు అవకాశాలు లేనప్పుడు క్వీన్​ చిత్రాన్ని తెరకెక్కించాం. 'తను వెడ్స్​ మను' సినిమా కోసం దర్శకుడు ఆనంద రాయ్​ని ఫైనాన్సర్ల వద్దకు తీసుకెళ్లి నేను సినిమా పూర్తి చేయడంలో సాయం చేశాను. కావాలంటే మీరు ఒకసారి అతడ్ని అడగవచ్చు అని అనురాగ్​ కశ్యప్​ అన్నారు.

 

దీనికి కంగనా రనౌత్ టీమ్​ స్పందిస్తూ.. "అవును ఇది నిజం. మరొక నిజం ఏమిటంటే మీ కెరీర్​లో 'క్వీన్​' సినిమా మాత్రమే ఏకైక విజయంగా ఉంది. ఫాంటమ్​ యూ 4 పార్ట్​నర్స్ అనే ప్రొడక్షన్​​ హౌస్​ నుంచి ఆ చిత్రం విడుదలైంది. కనీసం ఆమెకున్న కృతజ్ఞతా భావమైనా మీలో ఉండాలి" అని పోస్ట్​ చేశారు.కంగనా రనౌత్​ ప్రధానపాత్రలో నటించిన 'క్వీన్'​ చిత్రం 2013లో వయాకామ్​ 18 మోషన్​ పిక్చర్స్​తో పాటు ఫాంటమ్​ ఫిల్మ్స్​ సంస్థలు విడుదల చేశాయి. అనురాగ్​ కశ్యప్​, విక్రమాదిత్య మోత్వానే, మధు మంతేనా, వికాస్​ బహల్​లు కలిసి ఈ చలన చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థలను ప్రారంభించారు.గతేడాది కంగనకు సంబంధించిన ఓ వీడియోను అనురాగ్​ షేర్​ చేశారు. 'మణికర్ణిక' ప్రాజెక్టులో కొంత భాగానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టినట్లు చెప్పుకొని.. సినిమా క్రెడిట్ మొత్తం ఆమె ఖాతాలో వేసుకుందని అనురాగ్​ విమర్శించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: