జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో  శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ముఖ్య పాత్రల్ని పోషిస్తుండగా.. వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ టైటిల్‌కి తగ్గట్టుగా ముగ్గురు హీరోల పాత్రల్ని చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ముగ్గురు హీరోలు రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ పెట్టి కనిపిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం జనాల్లో క్యూరియాసిటీని పెంచేస్తోంది. ఈ సినిమాకి ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ మూవీకి రాజ్ నోముల కెమెరామెన్‌గా, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో ఆడియెన్స్‌ని అలరిస్తామని టీం కాన్ఫిడెంట్‌గా ఉంది.


ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ తరం యువత ఆలోచనలకు, వారి లైఫ్‌స్టైల్‌కు అద్దం పట్టేలా దర్శకుడు కార్తీక్ గరిమెల్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముగ్గురు మిత్రుల మధ్య సాగే వినోదాత్మక ప్రయాణంతో పాటు నేటి సమాజంలో జరిగే కొన్ని ఆసక్తికర సంఘటనలను కామెడీ డోస్ తగ్గకుండా చూపించబోతున్నారు. ముఖ్యంగా యూత్‌ని మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చిత్రబృందం పేర్కొంది.


సాంకేతికంగా కూడా ఈ చిత్రం ఎక్కడా రాజీ పడకుండా రూపుదిద్దుకుంటోంది. రాజ్ నోముల ఫ్రేమింగ్స్, జమీర్ షేక్ ఎడిటింగ్ వర్క్ సినిమా అవుట్‌పుట్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిఎస్ఆర్ క్రియేషన్స్, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సంస్థలు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తికాగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.




నటీనటులు : తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు

సాంకేతిక బృందం
సమర్పణ : జీఎస్ఆర్ క్రియేషన్స్
సహ సమర్పణ : స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్
నిర్మాత :శోభారాణి గరిమెల్ల
దర్శకుడు :కార్తీక్ గరిమెల్ల
కెమెరా :రాజ్ నోముల
సంగీతం :ఎస్. సుహాస్
ఎడిటింగ్ :జమీర్ షేక్
పీఆర్వో :  సాయి సతీష్


మరింత సమాచారం తెలుసుకోండి: