చిరంజీవి నటించిన సినిమాలు 151. అందులో చిరంజీవి రాధ కాంబినేషన్‌లో ఎన్ని సినిమాలు వచ్చయో తెలుసా. తెలియకుంటే తెలుసుకుందాం. 1984లో తాతినేని ప్రసాద్‌ డైరెక్ష‌న్‌‌లో నాగు సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ కె చక్రపాణి. 1984లో కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో గూండా మూవీ విడుదల అయ్యింది. దీనికీ కె చక్రపాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.  కోదండ రామిరెడ్డి, చిరంజీవి మరోసారి 1985లో రక్తసింధూరంతో ప్రజల ముందుకువచ్చారు. కోదండరామిరెడ్డి దర్శకత్వం, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కె చక్రవర్తియే పనిచేశారు. 1985లో అడవిదొంగ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమాకు డైరెక్టర్‌ కె రాఘవేంద్రరావు, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కే చక్రవర్తిని తీసుకున్నారు. 1985లోనే పులి చిత్రం విడుదల కాగా, డైరెక్టర్‌ రాజ్‌భరత్‌ దర్శకత్వం వహించగా, మ్యూజిక్‌ బాధ్యతను కె చక్రవర్తి తీసుకున్నారు. 1986లో రాక్షసుడు చిత్రం విడుదలైంది. మరలా దర్శకుడిగా కోదండ రామిరెడ్డి, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఇళయరాజా పనిచేశారు. 

 

మరలా 1986లో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు, రాధ కాంబినేషన్‌లో కొండవీటి రాజా విడుదలైంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా కె చక్రవర్తి వ్యవహరించారు. 1987లో జేబుదొంగ రిలీజ్‌ అయ్యింది. దీనికి దర్శకత్వ, మ్యూజిక్‌ బాధ్యతలు, కోదండ రామిరెడ్డి, కె చక్రవర్తి చూసుకున్నారు. 1988లో వచ్చిన మరణమృదంగానికి కోదండ రామిరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. 1988లో యముడికి మొగుడు చిత్రం విడుదల కాగా, దర్శకుడిగా రవిరాజా పిన్నిశెట్టి పనిచేశారు. సంగీతాన్ని రాజ్‌,కోటి అందించారు. 1989లో లంకేశ్వరుడు రిలీజ్‌ అయ్యింది. దాసరి నారాయణరావు దర్శకత్వ బాధ్యతలు వహించారు. రాజ్‌ కోటీ సంగీతాన్ని సమకూర్చారు. 1989లో రుద్రనేత చిత్రం విడుదల కాగా, కె రాఘవేంద్రరావు, ఇళయరాజా వరుసగా దర్శకత్వాన్ని, సంగీతాన్ని అందించారు. 1990 దశకంలో కొదమసింహం చిత్రానికి మురళీధరరావు దర్శకత్వం వహించగా, రాజ్‌కోటీ మ్యూజిక్‌ను అందించారు. 1990 అదే ఏడాదిలో రెండో సినిమా కొండవీటి దొంగ చిత్రంలో చిరంజీవి నటించగా, దర్శకత్వాన్ని కోదండరామిరెడ్డి పర్యవేక్షించారు. బాణీలను ఇళయరాజా సమకూర్చారు. 

 

చిరంజీవి, రాధ కాంబినేషన్‌లో మొత్తంగా 14 చిత్రాలు వచ్చాయి. చిరంజీవి, రాధ పోటీ పడి మరి నృత్యాులు చేసే వారంట‌. వారిద్దరి కాంబోలో విడుదలైన సినిమాకు జనం వారిద్దరి డ్యాన్సులు చూడటానికి వ‌చ్చేవారంటే అర్ధం చేసుకోవచ్చు. చిరంజీవికి కొరియాగ్రాఫర్‌ ఉండేవారు.. రాధా నృత్యం నేర్చుకున్నట్లు తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: