మోక్షగ్న ఎంట్రీ కోసం బాలకృష్ణ అభిమానులు చాలారోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. వారసుడికి యువరత్న ట్యాగ్ ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. అయితే చాలా రోజుల నుంచి ఎదురుచూస్తోన్న నందమూరి అభిమానుల నిరీక్షణకు వచ్చే ఏడాది తెరపడుతుందని ప్రచారం జరుగుతోంది. బాలయ్య ఈ కరోనా లాక్ డౌన్ ని కొడుకు లాంచింగ్ కి ఉపయోగిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
బాలకృష్ణ షూటింగులు ఆగిపోయినప్పటి నుంచి మోక్షగ్న కోసం కథలు వింటున్నాడట. యంగ్ మేకర్స్ తో కొడుకుకి సెట్ అయ్యే స్టోరీస్ రెడీ చేయిస్తున్నాడని టీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకరిద్దరితో డిస్కషన్స్ జరిగాయని కథలు సిద్ధమవుతున్నాయని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఈ కరోనా ప్రభావం తగ్గి షూటింగ్ రీస్టార్ట్ కాగానే మోక్షగ్న లాంచింగ్ ఉంటుందని తెలుస్తోంది.
మోక్షగ్న ఇంతకుముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో లాంచ్ అవుతాడనే టాక్ వచ్చింది. అలాగే క్రిష్ దర్శకత్వంలో ఎంట్రీ ఇస్తాడనే మాటలు వినిపించాయి. సింగీతం శ్రీనివాసరావు రాసిన ‘ఆదిత్య 369’ సీక్వెల్ ‘ఆదిత్య 999’లో మోక్షగ్న నటిస్తాడనే ప్రచారం కూడా జరిగింది. మరి ఇప్పుడేమో బాలయ్య యంగ్ మేకర్స్ తో డిస్కషన్లు పెడుతున్నాడని సినీజనాలు చెప్పుకుంటున్నారు. మరి బాలయ్య వారసుడిని ఎవరు డైరెక్ట్ చేస్తారు అన్నది చూడాలి.
నందమూరి వారసులు బాలకృష్ణ కుమారుడి రీఎంట్రీ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన హీరో పుత్ర రత్నానికి వెండితెరపై చూడాలని తహతహలాడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఆదరించినట్టే.. మోక్షజ్ఞను కూడా అక్కున చేర్చుకోవాలని ఆరాటపడుతున్నారు. ఆ గడియ ఎప్పడు వస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి