ఇలాంటి పరిస్థితులలో రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న పవన్ ‘వకీల్ సాబ్’ మూవీలో అదేవిధంగా క్రిష్ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తూ ఉన్నా పవర్ స్టార్ అభిమానుల ఆశలు అన్నీ తిరిగి హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోతున్న మూవీ ప్రాజెక్ట్ పైనే ఉన్నాయి. వాస్తవానికి కరోనా సమస్యలు రాకుండా ఉండి ఉంటే ఈమూవీ ఈ సంవత్సరం చివరిలో ప్రారంభం అయి ఉండేది.
ఇప్పటి వరకు హరీష్ శంకర్ అనేక మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఈమూవీ పూర్తి మాస్ ఎంటర్ టైనర్ అంటూ లీకులు ఇస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఈమూవీకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అంతా మారినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ కథ రాజకీయాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో పవన్‍కళ్యాణ్ పొలిటీషియన్ గా కనిపిస్తాడని ఒక సామాన్యుడు రాజకీయ నాయకుడైతే ఏవిధంగా ప్రజలకు మంచి జరుగుతుందో అలాగే ఏవిధంగా అవినీతికి చరమగీతం పాడతాడో ఈచిత్రంలో చూపిస్తారని లీకులు వస్తున్నాయి. వచ్చే ఏడాది చివరిలో మళ్ళీ పవన్ జనం మధ్యకు రాబోతున్న పరిస్థితులలో ఆ సమయానికి పవన్ క్రేజ్ మరింత పెంచడానికి ఆ తరువాత జనసేన తరపున మళ్ళీ పవన్ ప్రచారం చేయడానికి ఈ మూవీ కథ అన్నివిధాల సహకరిస్తుంది అని అంటున్నారు. అయితే ఈవిషయాల పై హరీష్ శంకర్ తన సన్నిహితుల వద్ద కూడ ఎటువంటి లీకులు ఇవ్వకుండా మౌనం వహిస్తున్న పరిస్థితులలో హరీష్ శంకర్ ఈ మూవీలో పవన్ ను ఏవిధంగా ఎలివేట్ చేస్తాడు అన్నవిషయమై అంచనాలు పెరిగిపోతున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి