మామూలుగా చిత్ర పరిశ్రమకు చెందిన వారి పెళ్లిళ్లు అంటే ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు అంటే కొన్ని రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది... సోషల్ మీడియాలో అభిమానులు వారి పెళ్లి గురించి ఎన్ని పోస్టులు పెడుతుంటారు. మామూలుగా సినీ సెలబ్రిటీల కు సంబంధించి ఎవరి పెళ్లి అయినా ఇలాంటి హడావిడి ఉంటుంది, ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నది . హీరోయిన్ షాలిని వడ్నీకట్టి .. నిన్న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా ఇటీవల ఓటిటి  వేదికగా రిలీజై మంచి విజయాన్ని అందుకుంది,



 ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు, ఈ సినిమాలో రాధా క్యారెక్టర్లో కనిపించిన షాలిని... ట్రెడిషనల్  లుక్కుతో ఎంతో మంది సినీ అభిమానులు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు ఇప్పటివరకు చేసింది కొన్ని సినిమాలే...  మామూలుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు అన్న విషయం తెలిసిందే కానీ ఈ హీరోయిన్ మాత్రం  ఉన్నట్టుండి నిన్న వివాహం చేసుకుంది. మనోజ్ బీద అనే యువకుడిని వివాహం చేసుకుంది హీరోయిన్ షాలిని.



 కరోనా  నిబంధనలు పాటిస్తూ తక్కువమంది బంధుమిత్రుల మధ్య వీరి పెళ్లి జరిగింది. కాగా ప్రస్తుతం హీరోయిన్ షాలిని పెళ్లి చేసుకున్న యువకుడు మనోజ్ దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇప్పటికే తమిళంలో ఓ సినిమా తీశాడు. ఈ సినిమాకు తమిళంలో మంచి పేరు కూడా వచ్చింది, మనోజ్ తో హీరోయిన్ షాలిని కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ప్రేమ ఎట్టకేలకు ఎవరికీ తెలియకుండా పెళ్లిపీటలు ఎక్కింది. మొదటగా ప్లస్ అనే సినిమా ద్వారా తన కెరీర్ను ప్రారంభించిన హీరోయిన్ షాలిని... కన్నడ లోనే కొన్ని సినిమాలు చేసింది. కృష్ణ అండ్ హిజ్  లీలతో తెలుగులో పరిచయమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: