నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది తన తండ్రి విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అవి అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయాయి. వాటి అనంతరం తమిళ దర్శకుడు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్ సినిమాలో నటించిన బాలయ్య, దాని తో కూడా మరొక పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
ఇక దాని తర్వాత మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేయడానికి సిద్దమైన బాలయ్య, ఇటీవల ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. కరోనా వలన విధించబడిన లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్నాళ్ల నుండి ఆగిపోయింది. కాగా అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ని జరుపుకోనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసి సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా బాగా అంచనాలు ఏర్పరిచింది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది.
దాని ప్రకారం ఈ సినిమాలోని సెకండ్ హాఫ్ లో అదరగొట్టే మాస్ ఐటెం సాంగ్ ఉండనుందని, కాగా ఆ సాంగ్ కోసం ఒక ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని నిర్ణయించిందట సినిమా యూనిట్. రెండు రోజుల క్రితమే ఆమె ఎంపిక కూడా జరిగిపోయిందని, మరికొద్దిరోజుల్లో దానికి సంబంధించి అధికారికంగా సమాచారం కూడా బయటకు రానుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, బాలయ్య ఫ్యాన్స్ కు ఇది పెద్ద పండుగ వార్త అని చెప్పవచ్చు .....!!

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి