యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజమౌళి తెరకెక్కించిన కళాఖండం "బాహుబలి" ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ తో "సాహో" లాంటి యాక్షన్ మూవీ తీసి నార్త్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. అయితే ఈ సినిమా తెలుగులో ప్లాప్ అయినా కానీ హిందీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఈ ఫ్లో లో వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్.  

‘సాహో’ తరువాత ప్రభాస్ నుండీ రాబోతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల క్రితం విడుదల చేసారు. అయితే ఆ ఫస్ట్ లుక్ అంతగా క్లిక్ అవ్వలేదు. ఈ చిత్రం షూటింగ్ అప్పుడే 30శాతం పైనే పూర్తయ్యింది. ‘సాహో’ ఫలితం తరువాత ఈ ప్రాజెక్ట్ ని కొన్నాళ్ల పాటు హోల్డ్ లో పెట్టి స్క్రిప్ట్ లో చాలా మార్పులు కూడా చేసారని సమాచారం. ఈ ప్రాజెక్టుని నిర్మాతలు కానీ హీరో ప్రభాస్ కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదనే కామెంట్స్ కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు.

‘సాహో’ కి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక ఏర్పడ్డ హైప్.. ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ విడుదలయ్యాక ఏర్పడలేదు. బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం పై ఇంట్రెస్ట్ లేనట్టే కనిపిస్తుంది. ఇక ప్రభాస్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాగ్ అశ్విన్ ప్రాజెక్టు అలాగే ఓం రౌత్ తెరకెక్కించే ‘ఆదిపురుష్’ ప్రాజెక్టు పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అసలు తన 20వ సినిమా గురించి కనీసం స్పందించడం లేదు. అయితే దర్శకుడు రాధా కృష్ణకుమార్ మాత్రం సోషల్  మీడియాలో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లు నిర్వహిస్తూ తన సినిమా కూడా వార్తల్లో ఉండాలని తహతహలాడుతున్నాడు. పోనీ అక్కడ అభిమానులు అడిగే కీలక ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడా అంటే.. అదేమీ లేదు.

అయితే ‘రాధే శ్యామ్’ ను మాత్రం 2021 సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టు మాత్రం చెప్పి కాస్త ఊరట కలిగించాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ వ్యవహారం చూస్తుంటే అలా కనిపించడం లేదు. నిజానికి సెకండ్ షెడ్యూల్ పూర్తయిన వెంటనే ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తాం అని దర్శకుడు ప్రకటించినప్పటికీ నిర్మాతలు మాత్రం వారికి నచ్చిన సమయంలోనే విడుదల చేశారు. కాబట్టి రిలీజ్ విషయంలో రాధా కృష్ణ చెప్పిన మాట పూర్తిగా నిజమయ్యే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: