రకుల్ ప్రీత్ సింగ్ కొన్నాళ్లుగా స్లో ఫేజ్ లో ఉంది. ‘మన్మథుడు-2’లో ఓల్డ్ లుక్ లో కనిపించిందనే నెగటివ్ టాక్ రావడంతో, రకుల్ కి అవకాశాలు తగ్గిపోయాయి. స్టార్ హీరోలు ఈమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. దీంతో చిన్న సినిమాలకు షిప్ట్ అయి కెరీర్ ని నెట్టుకొస్తోంది. ఇలాంటి సిట్యువేషన్ లో ఉన్న రకుల్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది డ్రగ్స్ వ్యవహారం.
రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాక రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. రియా తన ఫ్రెండ్స్ సారా అలీఖాన్, రకుల్ కూడా డ్రగ్స్ తీసుకుంటారని ఎన్.సి.బి. విచారణలో చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో రకుల్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్ లు. రకుల్ ఫోటోస్ తో రకరకాల మీమ్స్ తయారు చేశారు. ఇన్నిరోజులు జిమ్ చేయడం వల్ల ఇలాంటి బాడీ వచ్చిందని భ్రమ పడ్డాం. డ్రగ్స్ తో ఇలా ఉన్నావా అంటూ కామెంట్లు పెట్టారు.
రకుల్ ప్రీత్ సింగ్ పేరు డ్రగ్స్ వ్యవహారంలోకి రాగానే బోల్డంత నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. ఆడియన్స్ లోనూ రకుల్ అంటే చులకనభావం ఏర్పడింది. మరి ఇలాంటి ఇమేజ్ ఉన్న హీరోయిన్ కి భారీ అవకాశాలు వస్తాయా.. స్టార్ డైరెక్టర్స్, హీరోలు ఈమెని కన్సిడర్ చేస్తారా అంటే కొంచెం కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రకుల్ కెరీర్ మరింత కష్టాల్లోకి వెళ్లే ప్రమాదముందని చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి