బాలీవుడ్ లో సూపర్ హిట్టైన అందాదున్ తెలుగు రీమేక్ లో నితిన్ హీరోగా నటిస్తున్నాడు. ఆయుష్మాన్ ఖురానా హీరోగా టబు, రాధికా ఆప్టే ఫీమేల్ లీడ్ గా నటించిన అందాదున్ బాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పించింది. ఇప్పుడు ఆ సినిమా తెలుగు రీమేక్ లో నితిన్ నటిస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తుంది. ఈ సినిమా లో రాదిక ఆప్టే ప్లేస్ లో నభా నటేష్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా టబు పాత్రలో ఎవరన్నది నిర్ణయించలేదని అన్నారు.

టబు, అనసూయ, శ్రీయ ఇలా రోజుకొకరి పేరుని వార్తల్లో రాసుకొచ్చారు. ఫైనల్ గా టబు ప్లేస్ లో మిల్కీ బ్యూటీ తమన్నని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆ సినిమా నిర్మాణ సంస్థ్ శ్రేష్ఠ్ మూవీస్ వారు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అందాదున్ సినిమాలో టబు హాట్ హాట్ గా అదరగొట్టింది. రాధికా ఆప్టే కూడా సినిమాలో బోల్డ్ గా నటించింది. మరి తెలుగు రీమేక్ లో నటిస్తున్న తమన్నా.. నభా నటేష్ వాళ్ళను రీప్లేస్ చేస్తారా లేదా అనది చూడాలి.

ఈ ఇయర్ భీష్మతో హిట్ అందుకున్న నితిన్ తన నెక్స్ట్ సినిమా రంగ్ దే షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న రంగ్ దే సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి చేశాక అందాదున్ తెలుగు రీమేక్ సెట్స్ మీదకు వెళ్తుంది. మేర్లపాక గాంధి డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ కు టైటిల్ ఇంకా మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. టబు ప్లేస్ లో తమన్నా అనగానే ఆడియెన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.              

మరింత సమాచారం తెలుసుకోండి: