ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ ఎంతో ప్రభంజనం సృష్టించాడు. కెరీర్ ప్రారంభంలోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. తన వినూత్న నటనతో ప్రముఖ డైరెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఆ మూవీతో మంచి పేరును సంపాదించుకున్నారు.90 ఎంఎల్ సినిమాతో మరోసారి బ్లాక్ బాస్టర్ అందుకోవాలని అనుకున్న కార్తికేయకు.... కథ ప్రేక్షకులకు రీచ్ కాక... ఆశించిన ఫలితం దక్కలేదనే చెప్పాలి. నాని గ్యాంగ్‌ లీడర్‌ సినిమాలో విలన్‌గా మారి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ మధ్యలో హిప్పీ చిత్రంతో తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు ఈ కండల హీరో.  ఇక ప్రస్తుతం కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయమవుతున్నారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు దర్శకుడు.


అయితే మన హీరోకు... కోలీవుడ్ నుంచి ఒక లక్కీ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అదేంటంటే కోలీవుడ్‌ టాప్ హీరో అజిత్ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కార్తికేయను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అజిత్‌ హీరోగా వినోద్‌ తెరకెక్కిస్తోన్న వలిమైలో కార్తికేయ కనిపించనున్నారు. మొదట్లోఈ వార్తలు వినిపించినా అధికారికంగా ప్రకటించకపోవడంతో నిజమా కాదా అని డైలమాలో ఉన్న ప్రేక్షకులకు స్వీట్ న్యూస్ వినిపించారు కార్తికేయ. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఓ ట్వీట్ చేసిన కార్తికేయ, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అజిత్ ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్తూ.... చాలా కష్టపడి, అందరూ గర్వపడేలాగా ఆ పాత్ర చేస్తానని తెలిపారు. అంతేకాదు ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేనంటూ తమిళ్‌లో కామెంట్ పెట్టిన కార్తికేయ.. వలిమై, వెయిటింగ్ ఫార్ తాళ దర్శనమ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లు ఇవ్వడంతో అజిత్‌ చిత్రంలో కార్తికేయ కన్ఫర్మ్ అని అర్థం అవుతోంది. మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మిస్తుండటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: