బాలీవుడ్‌ పెర్‌ఫార్మెన్స్‌ బ్యూటీ అలియాభట్‌ ట్రిపుల్‌ ఆర్‌తో తెలుగులోకి అడుగుపెడుతోంది. నెపోటిజంతో కోల్పోయిన ఇమేజ్‌ను తెలుగు సినిమాతో భర్తీ చేస్తుందో లేదోగానీ.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్‌ చరణ్‌తో జత కడుతోంది అలియా. ఇంతవరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్స్‌లోకి అడుగుపెట్టని ఈ నెపోటిజం భామ దసరా తర్వాత రెండు నెలలపాటు డేట్స్ ఇచ్చింది.

బాలీవుడ్‌ గ్లామర్‌ హీరోయిన్‌ అనన్యపాండే విజయ్‌ దేవరకొండతో జోడీ కడుతోంది. పూరీ, కరణ్‌ జోహార్‌ కలిసి పాన్‌ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.  ప్రముఖ హిందీ నటుడు చుంకీ పాండే కూతురైన అనన్య గత ఏడాది "స్టూడెంట్‌ ఆఫ్‌ దిఇయర్‌ 2'తో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత  'పతి పత్ని ఔర్‌ ఓ' మూవీలో నటించింది.  'ఖాలీ పీలి'  మూవీ అక్టోబర్‌2న ఓటీటీలో రిలీజ్‌ అవుతోంది. మరో ఆఫర్‌ లేని అనన్యకు పూరీ ఛాన్స్ ఇచ్చాడు. పాన్‌ ఇండియా మూవీ కావడంతో బాలీవుడ్‌ భామ అయితే బెటర్‌ అన్న వుద్దేశంతో.. అనన్యను తీసుకున్నారు. దీపిక.. కత్రిన వంటి హీరోయిన్ని తీసుకోవాలంటే... 10 కోట్లకు పైగా  ఇవ్వాలి. ఇందులో సగంలో సగం ఇచ్చి హిందీ ఆడియన్స్‌తో టచ్‌ ఉన్న అనన్యను తీసుకుంది రీ అండ్‌ టీం.


సాహోలో ఐటంసాంగ్‌ చేసిన జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తెలుగులో హీరోయిన్‌గా మారబోతోంది. హిందీలో ఎటాక్‌ తప్ప మరో సినిమా లేని జాక్వెలిన్‌ క్రిష్‌ మూవీలో పవన్‌ సరసన నటిస్తోందన్న వార్త నడుస్తోంది. అక్షయ్‌కుమార్‌తో గబ్బర్‌ ఈజ్ బ్యాక్‌.. మణికర్ణిక తీసి పేరు తెచ్చుకున్న క్రిష్‌ పవన్‌ మూవీని పాన్‌ ఇండియా లెవెల్లో తీస్తున్నారని.. అందుకే.. అక్కడి భామనే ప్రిఫర్‌ చేస్తున్నారట.

మొత్తానికి బాలీవుడ్ భామలు మన తెలుగు వైపు అడుగులు వేస్తున్నారు. మన స్టార్ హీరోలతో జత కట్టి ఇక్కడ కూడా తమ జెండా పాతేయాలని చూస్తున్నారు. మనోళ్లేమో.. బాలీవుడ్ వైపు ఆశగా చూస్తున్నారు. విచిత్రంగా ఉంది కదూ..


మరింత సమాచారం తెలుసుకోండి: