కేవలం బిగ్బాస్ మొదలైన మూడో వారానికి హౌస్ నుండి బయటికి వచ్చింది దేవి నాగవల్లి. ఇక ఎలిమినేషన్ తర్వాత స్టేజ్ మీదికి వచ్చిన దేవి నాగవల్లి టీం సభ్యులందరికీ మంచి సలహాలు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అవ్వగా ఈ ముగ్గురిలో కూడా కామన్ పాయింట్ ఒకటుంది అన్న టాక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొదటి వారం సూర్యకిరణ్ రెండో వారం కరాటే కళ్యాణి మూడో వారం దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యారు. ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే వయసులో కాస్త పెద్దవారు.
అంతేకాదు ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా హౌస్ లో కాస్త పెద్దరికాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు అనే టాక్ వినిపిస్తోంది. అయితే పెత్తనం అనేకంటే ఇతరులకు సలహాలు ఇవ్వడం లాంటివి చేశారు ఈ ముగ్గురు ఎక్కువగా. అయితే ఇదే ప్రేక్షకులకు నచ్చడం లేదు అన్న టాక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందుకే బిగ్బాస్ హౌస్ నుంచి వరుసగా ఈ ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు అంటూ చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ టాపిక్ మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి