టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. శృతిహాసన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు, హర్ష అనే క్యారెక్టర్ లో అద్భుతమైన నటనను కనబరిచారు. ఆ తరువాత మరొకసారి మహేష్ బాబు, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా భరత్ అనే నేను. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా పలు కమర్షియల్ హంగులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు.
కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి అంచనాలతో రిలీజ్ అయి భారీ విజయాన్ని దక్కించుకుంది. సితార, ప్రకాష్ రాజ్, ఆమని, శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మహేష్, కియారా అద్వానీ ల జోడి ప్రేక్షకాభిమానులను ఎంతో అలరించింది. ఇక ఈ సినిమాని బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నారు అంటూ కొద్ది రోజులుగా పలు మీడియా లో వార్తలు వస్తున్నాయి.

ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాని బాలీవుడ్ లో ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ రీమేక్ చేయనున్నారని ఇప్పటికే ఈ రీమేక్ విషయమై అన్నివిధాల సన్నద్ధమైన అక్షయ్ కుమార్ అతి త్వరలో దీనిని పట్టా లెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడూ కొంత విభిన్నమైన కథా సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉండే అక్షయ్ కు ఈ సినిమా ఎంతో నచ్చిందని, ఒక ప్రముఖ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండగా, హిందీలోని యువ దర్శకుడు ఒకరు దీనిని తీయనున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: