మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి మొదటిసారిగా ఖైదీ నెంబర్ 150 చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాల్లో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించారు. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ బడా నిర్మాతగా అవతారం ఎత్తిన రామ్ చరణ్ ఆచార్య సినిమాని కూడా నిర్మించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ సారి మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కూడా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ తో కలసి ఆచార్య సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా చిరంజీవి షూటింగ్ లో పాల్గొనడం లేదని సమాచారం.


ఇదిలా ఉండగా గతంలో రామ్ చరణ్ తన బాబాయి అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని నిర్మిస్తానని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చెర్రీ ముందుగా చెప్పినట్టుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాని నిర్మించడానికి సిద్ధమయ్యారట. అయితే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమా గురించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతానికి మెెగా హీరో లైన రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేసేందుకు సానుకూలంగానే స్పందిస్తున్నారు అని తెలుస్తోంది.


ఇకపోతే రామ్ చరణ్ యాక్టర్ గా కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తున్న రామ్ చరణ్ యొక్క ఇంట్రో వీడియో ఇప్పటికే విడుదలై సంచలనం సృష్టించింది. ఈ వీడియోలో రామ్ చరణ్ ఫిట్నెస్ లెవెల్స్ సూపర్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. త్వరలోనే కొమరంం భీమ్ తారక్ ఇంట్రో వీడియో కూడా విడుదల కాబోతోందని తెలుస్తోంది. మరి ఈ రోల్ ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్ లో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: