అప్పట్లో హీరోయిన్ గా నటించిన జయసుధ ఇప్పుడు తల్లి పాత్ర ల్లో బాగా మెప్పిస్తోంది. తనదైన నటన తో ఈమె ఎంతటి వారినైనా యిట్టె ఆకట్టేసుకుంటుంది. ప్రియురాలిగా కవ్వించినా. ఇల్లాలిగా కనిపించినా. మాతృమూర్తిని మరిపించిన..... ఈమెకి ఈమె సాటి. మొట్ట మొదట ఈమె తెర పైకి ఎలా వచ్చిందో తెలుసా.. ?  1972 లో లక్ష్మీ దీపక్‌ దర్శకత్వం లో కృష్ణ హీరోగా నటించిన 'పండంటి కాపురం' సినిమా లో జమున కుమార్తెగా పరిచయం అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈమె ప్రేక్షకులని అలసరిస్తూనే వచ్చింది. 'అడవిరాముడు', 'ప్రేమాభిషేకం', 'శివరంజని', 'విచిత్రజీవితం', 'యుగంధర్‌', 'మేఘసందేశం', 'సుభాషిణి'.. ఇలా ఎన్నో సినిమాల్లో జయసుధ అద్భుత పాత్రలని చేయడం జరిగింది. అంతే కాదు తమిళ , మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించారు. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.




ఈమెకి ఐదు నంది అవార్డులు, ఆరు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, ఇతర అవార్డులు కూడా వచ్చాయంటే.... ఆమె ట్యాలెంట్ గురించి అర్ధం అయ్యే ఉంటుంది. జయసుధ అసలు పేరు సుజాత.  1959లో డిసెంబరు 17న మద్రాస్‌లో జన్మించారు. అక్కడే ఈమె పుట్టింది పెరిగింది. మద్రాసులో జన్మించినా ఈ నటి మాతృభాష తెలుగే. చక్కటి పేరు తెచ్చింది.   ఏది ఏమైనా ఒకటి తర్వాత మరొకటి చిత్రాలతో ఈమె నటిస్తూ మంచి స్థానం దక్కించుకుంది ఈమె.

'లక్ష్మణరేఖ' చిత్రంతో కథానాయికగా తొలిసారి హీరోయిన్ గా కనిపించి బాగా ఆకట్టేసుకుంది.  ఒకటా రెండా.....  దాదాపు అనేక తెలుగు చిత్రాల్లో జయసుధ నటించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు తన సినిమాల్లో జయసుధను ఎక్కువగా తీసుకునేవారు. ఇలా ఆమె తనకి ఇష్టమైన కెరీర్ ని తీసుకుని ఎంత గానో రాణించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: