ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... బిగ్ బాస్ సీజన్ 4 చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. అలకలు, గొడవలు, నామినేషన్ లతో రోజు రోజుకి రసవత్తరంగా సాగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అనేది ప్రతివారం జరిగే ప్రక్రియే. దీనినిబట్టే ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఈ నామినేషన్స్ తప్పించుకోవడం కోసం హౌస్ మేట్స్ మనసులు గెలవాలి. అలాగే ఎలిమినేషన్ తప్పించుకోవాలంటే బయట ఉన్న ప్రేక్షకులని గెలవాలి. ఇలా గెలిచినవాళ్లే విన్నర్ అవుతారు. అయితే, ఈవారం అంటే 8వ వారం నామినేషన్స్ లోకి ఏడుగురు వస్తారని తెలుస్తోంది. అయితే, ఆ ఏడో వ్యక్తి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది.

ప్రస్తుతం ఇండియా హెరాల్డ్  కి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం లిస్ట్ ప్రకారం చూస్తే.. ఈవారం నామినేషన్స్ అనేవి ఓపెన్ నామినేషన్స్ జరగబోతున్నాయి. సిరామిక్ పలకపైన హౌస్ మేట్ ఫోటని గొడ్డలితో కొట్టి మరీ నామినేట్ చేయాలి. ఒకరినొకరు రీజన్స్ చెప్పుకుంటూ నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇది నామినేషన్స్ ప్రక్రియ. ఇక ఇందులో మనకి ప్రస్తుతం ఆరుగురి పేర్లు లిస్ట్ లోకి వచ్చినట్లుగా తెలుస్తున్నాయి.

వారిలో అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్, అమ్మరాజశేఖర్, మెహబూబ్ దిల్ సే, లాస్య, అరియానా వీళ్లు నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, ఏడో వ్యక్తి కూడా ఉన్నాడని అందులో సోహైల్ లేదా అభిజిత్ ఉంటారని కూడా చెప్తున్నారు. ఇప్పటివరకూ అయితే లిస్ట్ లో వీళ్ల పేర్లు ఉన్నాయి. మరి ఈ వీక్ వీళ్లలోనే ఎలిమినేషన్ అనేది జరగబోతోంది. మొత్తానికి అదీ మేటర్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని సమాచారాలు తెలుసుకోండి.

కాగా ఈ సారి బిగ్ బాస్ ఇంటి నుంచి అనూహ్యంగా దివి ఎలిమినేట్  అయ్యింది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సిందే... ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...!!!

మరింత సమాచారం తెలుసుకోండి: