చెప్పిన మాటలు వినక చెడిపోతాడు ఒకరు. చెప్పుడు మాటలు విని చెడిపోతాడు ఇంకొకడు. కమెడియన్‌ సునీల్‌ పరిస్థితి రెండో రకం. నువ్వు తోపు.. తురుమ్‌ఖాన్‌ అని ఓ ఫ్రెండ్‌ కమ్‌ డైరెక్టర్‌ చెప్పిన మాటలు విని కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. గాడిలో పడుతున్నాడనుకుంటే.. మళ్లీ పాత దారిలోకే వెళ్తున్నాడు  సునీల్‌. అటు కమెడియన్‌గా.. ఇటు హీరోగా.. మరోవైపు విలన్‌గా మూడు పడవలపై కాలువేసి... అన్నింటికీ చెడిన రేవడిలా సునీల్‌ కెరీర్‌ తయారయింది.  

ఎవరయినా యు టర్న్‌ ఒకసారి తీసుకుంటారు. కానీ.. సునీల్‌ మాత్రం రెండు మూడుసార్లు తీసుకున్నాడు. తాజాగా కెరీర్‌కు మరోసారి ఛేంజ్‌ ఓవర్‌ వేసి.. హీరోగా నటిస్తున్నాడు. కమెడియన్‌గా.. విలన్‌గా సక్సెస్‌ రాకపోవడంతో.. 'వేదాంతం రాఘవయ్య' సినిమాతో మళ్లీ హీరోగా మారాడు సునీల్‌. నీకు హీరోగా తిరుగుండదని ఫ్రెండ్‌ కమ్‌ డైరెక్టర్‌ ఇచ్చిన సలహా మేరకు... కమెడియన్‌గా రోజుకు 3 లక్షలు తీసుకునే సునీల్‌ ఆ రోల్స్‌ వదిలేసి హీరో అయ్యాడు. కథానాయకుడిగా ఫెయిల్‌ అయినా.. పోయిన చోటే వెతుక్కోవాలని ఆ దర్శకుడు ఇచ్చిన సలహా సునీల్‌ కెరీర్‌ పాలిట శాపంగా మారిందా?

కమెడియన్‌గా సునీల్‌ తనకంటూ ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశాడు. ఒకానొక సమయంలో హయ్యెస్ట్ పెయిడ్‌ కమెడియన్‌ అనిపించుకున్నాడు. చిరంజీవి నుంచి రామ్‌చరణ్‌ వరకు.. నాగార్జున నుంచి నాగచైతన్య వరకు అందరూ సునీలే కావాలని పట్టుబట్టినవాళ్లే. ఒకానొక సమయంలో టాప్‌ కమెడియన్‌ అంటే సునీలే.

అందాలరాముడుతో హీరోగా మారిన సునీల్  మర్యాదరామన్న.. పూలరంగడుతో హిట్స్ కొట్టాడు. హీరోగా నీకు తిరుగులేదు... కంటిన్యూ చేయమని.. రూమ్‌మేట్‌ ఇచ్చిన సలహాను పాటించాడు. అసలుసిసలైన హీరోయిజం చూపించడానికి బొద్దుగా వుండే సునీల్‌ వెయిట్‌ తగ్గి  సిక్స్‌ ప్యాక్‌ అవతారం ఎత్తాడు. ఇంతలో వచ్చిన వరుస ఫ్లాపులతో  అడ్రస్‌ మిస్‌ చేసుకున్నాడు మొత్తానికి సునీల్ పరిస్థితి ఏంటో ఆయనకే అర్థం కాలేదు. మరి ఏ పాత్రలో ఆయన సెటిల్ అవుతాడో చూడాలి.







మరింత సమాచారం తెలుసుకోండి: