టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దీనిని దాదాపు రూ. 500 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే రామ్ చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ ఇరువురు హీరోల పాత్రలకు సంబంధించిన పరిచయ టీజర్లు అత్యద్భుత రెస్పాన్స్ ను సంపాదించుకొని సినిమా పై భారీ స్థాయిలో అంచనాల పెంచడం జరిగింది. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే దీని తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎవరి సినిమా చేస్తారు అనేది మాత్రం ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. అయితే ఓ వైపు కొద్దిరోజుల నుండి ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో చరణ్ నటించనున్నారని అంటున్నారు. ఇక దీని తరువాత ఏకంగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం అవుతోంది.

కాగా వాస్తవానికి కొన్నేళ్ల క్రితం చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమై షూటింగ్ పనులు మొదలు కాకుండానే క్యాన్సిల్ అయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మరొక సారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా సెట్ కాలేదు. ఇక లేటెస్ట్ గా కొన్న టాలీవుడ్ వర్గాల నుండి ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో పక్కాగా రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. ఇటీవల తన వద్దనున్న ఒక కథను చరణ్ కి వినిపించిన కొరటాల అది ఆయనకు ఎంతో నచ్చడంతో అతి త్వరలో దానిని తెరకెక్కించేలా పక్కాగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి వీరిద్దరి సినిమా ఎట్టకేలకు బేరం సెట్ అవడంతో అటు అభిమానులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా దీనికి సంబంధించి అతి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రానుందని అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: