రౌడీ స్టార్ ముందు నుంచి యునీక్ గా ఉండడానికే చూస్తున్నాడు. అగ్రెస్సివ్ గా ఉంటూనే తనదైన ఆటిట్యూడ్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు. ఆ ప్రాసెస్ లో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే బీటౌన్ బ్యూటీలు కూడా టాలీవుడ్ పేరు చెప్పగానే ఈ మధ్య విజయ్ దేవరకొండనే గుర్తు చేసుకుంటున్నారు. ఇతగాడి స్టయిల్ కు బాలీవుడ్ భామలు ఫిదా అయిపోయారు.
రౌడీ స్టార్ అటు స్టయిలిష్ యాక్టర్ గానే కాకుండా మహేష్ , బన్నీలకు ధీటుగా బ్రాండ్ అంబాసిడార్ గాను అవతరించాడు. లోకల్ యాడ్ లతోనే కాకుండా కార్పొరేట్ యాడ్ లలోను కనిపిస్తున్నాడు. ఇప్పటికే కియరాతో కలిసి మెబాజ్ కోసం అదిరిపోయే యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. ఇదనే కాకుండా బాలీవుడ్ సినిమాలు చేయకపోయినా.. అక్కడి మీడియా హౌస్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇవన్నీ విజయ్ దేవరకొండ రేంజ్ ను అంతకంతకు పెంచేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ తాజా స్టెప్ లో భాగంగా వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. ఇప్పటికే రౌడీ స్టార్ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ లో సక్సెస్ అయిన ఈ అగ్రెస్సివ్ హీరో. ..ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలోకి అడుగు పెట్టాడు. హీరోగారి మూమెంట్స్, బిజినెస్ ఐడియాలను నిశితంగా పరిశీలిస్తున్న నేటితరం స్టార్టప్స్.. ఈ విషయంలో విజయ్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇప్పుడున్న విజయ్ స్పీడ్ చూస్తుంటే రానున్న రోజులలోను మరిన్ని స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ తరహా మైండ్ సెట్ తో ఇంతలా దూసుకుపోతున్న టాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ హీరో రౌడీ స్టారే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి