టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ ఎంతగానో నిరాశ చెందారు. ఇక ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో రాణిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా కొనసాగాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ వకీల్ సాబ్  తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.



 వకీల్సాబ్  సినిమా కొంతమేర షూటింగ్ కూడా జరుపుకున్న విషయం తెలిసిందే. అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమా ఏ రేంజిలో ఉండబోతుంది అని అభిమానులందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో వరుసగా పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వకీల్  సాబ్  సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం గుబురు గడ్డం పొడవాటి వెంట్రుకలు లుక్ మాత్రం మార్చలేదు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ తన లుక్ మార్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కొత్త లుక్  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత లుక్ మీద అంతగా ఆసక్తి కనబరిచని  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా కోసం లుక్  మార్చినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న గడ్డం పొడవాటి వెంట్రుకలు తొలగించి ప్రస్తుతం మళ్ళీ పాత్ర కోసం  స్టైల్ గా మారిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ న్యూ లుక్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: