టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన కంత్రి సినిమా ద్వారా దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చాడు మెహర్ రమేష్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మాతగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రిలీజ్ తర్వాత డిజాస్టర్ గా నిలిచింది. అయితే అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్ కలయికలో తెరకెక్కిన బాబీ సినిమా ద్వారా నటుడిగా పరిచయమైన మెహర్ రమేష్ ఈ విధంగా కంత్రి ద్వారా తొలి సినిమాతోనే భారీ డిజాస్టర్ ను అందుకున్నారు. ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న మెహర్ రమేష్ ఆపై మరొకసారి ఎన్టీఆర్ తో తెరకెక్కించిన శక్తి సినిమా ద్వారా మరొక భారీ పరాజయాన్ని మూట కట్టుకున్నారు.
అనంతరం విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన తెరకెక్కించిన షాడో సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూట కట్టుకొని మెహర్ రమేష్ కి దర్శకుడిగా మరింత చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే అప్పటి నుండి కూడా సినిమాలకు దర్శకత్వం విషయంలో దూరంగా ఉంటూ వస్తున్న మెహర్ రమేష్ అతి త్వరలో మెగా స్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళంలో మంచి సక్సెస్ సాధించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ గా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.
ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా మెహర్ రమేష్ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. నేడు మెహర్ రమేష్ జన్మదినం కావడంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత అనిల్ సుంకర ఆయనకు ప్రత్యేకంగా విషెస్ అందజేయడంతో ఆ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా మెహర్ రమేష్ ఒక సినిమా చేయనున్న హింట్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయమై మహేష్ బాబు ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. కెరీర్ పరంగా చాలా వరకు ఫ్లాప్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ తమ హీరోతో ఎటువంటి సినిమా తీస్తాడు అనేటువంటి అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం మహేష్ బాబుతో మెహర్ రమేష్ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు...!!
అనంతరం విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన తెరకెక్కించిన షాడో సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పరాజయాన్ని మూట కట్టుకొని మెహర్ రమేష్ కి దర్శకుడిగా మరింత చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే అప్పటి నుండి కూడా సినిమాలకు దర్శకత్వం విషయంలో దూరంగా ఉంటూ వస్తున్న మెహర్ రమేష్ అతి త్వరలో మెగా స్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళంలో మంచి సక్సెస్ సాధించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ గా ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా మెహర్ రమేష్ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. నేడు మెహర్ రమేష్ జన్మదినం కావడంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత అనిల్ సుంకర ఆయనకు ప్రత్యేకంగా విషెస్ అందజేయడంతో ఆ బ్యానర్ పై మహేష్ బాబు హీరోగా మెహర్ రమేష్ ఒక సినిమా చేయనున్న హింట్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయమై మహేష్ బాబు ఫ్యాన్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. కెరీర్ పరంగా చాలా వరకు ఫ్లాప్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ తమ హీరోతో ఎటువంటి సినిమా తీస్తాడు అనేటువంటి అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం మహేష్ బాబుతో మెహర్ రమేష్ సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు...!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి