పృథ్వీరాజ్.. బీజూ మీనన్ నటించిన అయ్యప్పనమ్ కోషియమ్ మళయాళంలో ఘన విజయం సాధిచింది. బీజూ మీనన్ అయ్యప్నగా.. పృథ్వీరాజ్ కోషియమ్‌గా పవర్‌ఫుల్ రోల్స్ పోషించారు. వీళ్ల యాక్టింగ్‌కు మాలీవుడ్ ఫిదా అయిపోయి.. బ్రహ్మరథం పట్టింది. ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్‌ను హారిక హాసిని క్రియేషన్స్ అనుబంధం సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సొంతం చేసుకుంది. పవన్‌కల్యాణ్‌ను అయ్యప్పన్ పాత్రకు ఎంచుకుంది. ఇందులో క్రాక్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపిస్తాడు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పవన్‌తో ఎనౌన్స్ చేసినా ఇది అయ్యప్పనమ్ కోషియమ్‌కు రీమేక్ అని చెప్పలేదు. మన నేటివిటి.. హీరోల ఇమేజ్‌కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేస్తున్నాడు దర్శకుడు శేఖర్ చంద్ర. రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటినుంచీ.. కోషియమ్ పాత్రకు రానా పేరు వినిపిస్తూనే వుంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. కోషియమ్ రోల్‌కు తనను సంప్రదించారని.. ఆ పాత్ర చేయడం తనకూ ఇష్టమేనని.. అయితే ఇంకా ఫైనల్ కాలేదంటున్నాడు రానా.
కోషియమ్ రోల్ రానాకు ఓ మంచి ఆఫర్ అనే చెప్పాలి. బాహుబలిలో భల్లాళదేవుడు రోల్ ఎంత పేరు తీసుకొచ్చిందో.. కోషియమ్ కూడా క్రేజ్ తీసుకువస్తుంది. పవన్‌తో పోటీపోటీగా నటించే రోల్ కావడం.. అయ్యప్పనమ్‌ను ఇరికించే పాత్ర కావడంతో.. రానాకు సూపర్‌ఆఫర్ వచ్చిందంటున్నాయి ఫిలిం వర్గాలు. మరి రానా డెసిషన్ ఏమిటో చూడాలి.
మొత్తానికి మళయాళ చిత్రం అయ్యప్పనమ్ కోషియల్ మాలీవుడ్ లో విజయ దుందుభి మోగించింది. తెలుగు రీమేక్ లో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెలక్ట్ అయ్యాడు. అంతేకాదు ఈ రోల్ ఓ యంగ్ హీరో దగ్గరకు వెళ్లిందన్ వార్తల్లో నిజముందని తేలింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి