ఒకప్పుడు పెద్ద హీరోలు అందరితో నటించి ఒక వెలుగు వెలిగిన శ్రియ తన క్రేజ్ ను కోల్పోవడంతో పవిత్ర లాంటి పనికిరాని సినిమాలలో నటించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అనుకోకుండా వచ్చిన మనం శ్రియ కెరియర్ కు అనుకోని ట్విస్ట్ ఇచ్చింది. మనం సినిమాలో ఆమెది సమంత పాత్రతో పోలిస్తే చాల చిన్న పాత్ర. కానీ ఈ సినిమాతో ఆమెకు సమంతతో సమానంగా పేరు వచ్చింది. దీనితో ఫుల్ జోష్ పై ఉన్న శ్రియ తనకు మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలో వెంకటేష్, పవన్ ల మల్టీ స్టారర్ ‘గోపాలా గోపాలా’ లో శ్రియను ఎంచుకోవడం షాకింగ్ న్యూస్ గా మారింది.  దీనికి కారణం ‘ఓమై గాడ్’ సినిమాలో శ్రియ పాత్ర లేదు. ఆమె పాత్రను తెలుగు వర్షన్ లో స్పెషల్ గా క్రియేట్ చేసారు. అసలు ‘మనం’ సినిమాలో శ్రియాకు అవకాశం ఇవ్వటానికి ప్రముఖ రాజకీయ నాయకుడు నాగార్జునకు సిపార్సు చేసాడని ఫిలిం నగర్ టాక్. సదరు నాయకుడు నాగ్ తో మంచి సంబందాలు ఉండటమే కారణం అని అంటున్నారు.  ఆ రాజకీయ నాయకుడితో శ్రియా చాలా క్లోజ్ గా ఉంటుందని సమాచారం. మరి ఆ రాజకీయనాయకుడి ప్రమేయం వల్లే శ్రియకు ‘గోపాలా గోపాలా’ లో కూడ అవకాశo వచ్చిందా అన్న విషయం ప్రస్తుతం ఫిలింనగర్ లో ఆ శక్తి దాయకంగా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: