కొద్దిరోజుల క్రితం డ్రగ్స్ కేసులో విచారణను ఎదుర్కుని అనేక సమస్యలు కొనితెచ్చుకున్న దీపికా పదుకొనె ఇప్పుడు నెమ్మదిగా ఆ షాక్ నుండి బయటపడి తను ఒప్పుకున్న సినిమాల పై దృష్టి పెడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమెకు కలిగిన ఊహించని అదృష్టం దూరం అవ్వడానికి పరోక్షంగా నాగ్ అశ్విన్ కారకుడుగా మారడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.


క్రియేటివ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపిక ప్రభాస్ పక్కన నటించబోతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో దీపిక పాత్ర ప్రభాస్ పాత్రతో సరిసమానంగా ఉంటుంది అని అంటున్నారు.


ఈపరిస్థితులు ఇలా ఉంటే బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ ప్రభాస్ తో తీయబోతున్న ‘ఆది పురుష్’ మూవీ కూడ వచ్చే ఏడాది మొదట్లో  ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో సీత పాత్రను నటించగల హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతున్న పరిస్థితులలో ఈ పాత్రకు దీపిక అన్నివిధాల సరిపోతుందని ఓమ్ రౌత్ భావించాడని టాక్.  దీనితో ఈ విషయమై ఈ దర్శకుడు దీపికను సంప్రదిస్తే తన డేట్స్ అన్నీ నాగ్ అశ్విన్ వద్ద ఉన్నాయని అతడు అంగీకరిస్తే తప్ప తాను సీత పాత్రను చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది.


అంతేకాదు ప్రభాస్ పక్కన హీరోయిన్ గా వెంటవెంటనే నటిస్తే దానికి పెద్దగా క్రేజ్ ఉండదని దీపిక అభిప్రాయపడినట్లు టాక్. ఓమ్ రౌత్ దీపిక చెప్పిన సమాధానంతో ఆమెను వదులుకుని సీత పాత్ర కోసం తన అన్వేషణ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. కియారా అద్వాని ఈమూవీలో సీత గా నటించడానికి ఆశక్తి కనపరుస్తున్నా ఓమ్ రౌత్ ఆలోచనలు మటుకు మరొక హీరోయిన్ పై ఉన్నాయి అని అంటున్నారు. వాస్తవానికి దీపిక ఈ మూవీలో సీతగా కనిపించి ఉంటే ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చి ఉండేది..

మరింత సమాచారం తెలుసుకోండి: