ఈ టీజర్ 24 గంటలు గడవకముందే ఏకంగా 16 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో పాటు 1.7 మిలియన్ లైక్స్ సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు 22 మిలియన్ వ్యూస్ దాటగా.. 1.9మిలియన్ లైకులతో ఎవరికీ అందని ఎత్తులో నిలిచింది ఈ టీజర్. విజయ్ స్టామినా ఏంటో మరో సారి రుజువు చేసింది...ఇప్పుడు దాకా 24 మిలియన్ వ్యూస్...2 మిలియన్ లైక్స్ రాబట్టి యు ట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతుంది.
ఇక లోకేష్ కనకరాజ్ కార్తితో ‘ఖైదీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇంత మంచి సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కావడంతో ‘మాస్టర్’పై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలన్నీ వరుసగా వందల కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపుతున్నాయి. దీంతో లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో నేరుగా విడుదలవుతున్న ‘మాస్టర్’తో విజయ్ రికార్డు కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే హంగామా చేస్తున్నారు.
ఈ సినిమాలో విజయ్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండటం విశేషం.ఇక ఈ సినిమా కచ్చితంగా ఒక సెన్సేషన్ క్రెయేట్ చేసేలా ఖాయంగా సినిమా టీజర్ చూస్తే అర్ధమవుతుంది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి