ఎంతో మంది తమిళ హీరోలు తమ డబ్బింగ్ సినిమాలతో... వారి అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవుతుంటారు. అదేవిధంగా తమిళ హీరో విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.... అదే సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు విజయ్ ఆంటోని. అలా బిచ్చగాడు సినిమాతో తెలుగు అభిమానులను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్. ఇక అప్పటి నుంచి ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం  ఆయన తమిళంలో నటిస్తున్న చిత్రం  ‘అగ్ని శిరగుగళ్‌’...  తెలుగులో
 " *జ్వాల* " టైటిల్.

ఇది ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోంది.డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలను ఎంచుకునే విజయ్ ఇప్పుడు అదే తరహాలో ఈ చిత్రంతో మరో కొత్త పాత్రలో.... డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తాడు అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా తెలుగు టైటిల్ విషయానికి వస్తే.... ఒకప్పుడు చిరంజీవి బ్లాక్ బాస్టర్ మూవీ టైటిల్‌ను తీసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్ విడుదల కాగా....విజ‌య్ ఆంటోని సీనుగా క‌నిపించ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ చూస్తే అర్థమవుతోంది....

ఈ విభిన్న హీరో మరో కొత్త పాత్రతో అలరించడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. ఈ చిత్రానికి న‌వీన్ ఎం దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై టీ శివ నిర్మిస్తున్నారు.  నటరాజన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. తన కెరీర్ లోనే మొట్ట మొదటి సారిగా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతున్న చిత్రమిది. ఈ చిత్రాన్ని ఏకంగా 25 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అక్షర హాసన్‌ నటిస్తున్నారు.. ఇక నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మద్య  రాబోతున్న ఈ చిత్రం ఎటువంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: