ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి తర్వాత రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఆలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రకారం ఈ ఆర్.ఆర్.ఆర్ మూవీ లోని ఫస్ట్ సాంగ్ ని సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని ఇక ఈ తొలి పాట హీరోలు ఇద్దరి కాంబినేషన్ లో వస్తుందని కాగా ఈ సాంగ్ కి కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ని జనవరి ఫస్ట్ రోజున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి