పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ఫుల్ లాయర్ పాత్ర పోషిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి తమన్ స్వరపరిచిన మగువా మగువా అనే సాంగ్ తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులు అలానే అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకోవడం జరిగింది/ ఇక అతి త్వరలో క్రిష్ సినిమా యొక్క రెండో షెడ్యూలు కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఇప్పటికే హరీష్ శంకర్ తో ఒక సినిమా అలానే సురేందర్ రెడ్డి తో మరో సినిమాతో పాటు యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం మూవీలో కూడా పవన్ కళ్యాణ్ నటించనున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించి కొద్దిసేపటి క్రితం నిర్మాతలైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి ఒక ప్రకటన అయితే రిలీజ్ అయింది.
దాన్నిబట్టి రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది అని ప్రేక్షకులు అలానే అభిమానులు సిద్ధంగా ఉండాలని నిర్మాతల తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు సమానంగా సాగే మరొక పాత్ర లో రానా లేదా సుమంత్ నటించే అవకాశం ఉందని ఇటీవల కొద్ది రోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక రేపటి అనౌన్స్మెంట్ దానికి సంబంధించిందే అని ఈ సినిమాలో ఆ కీలకమైన పాత్రలో సుమంత్ నటించనున్నారని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే రేపు ఉదయం వరకు వెయిట్ చేయక తప్పదు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు......!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి