ఇక కీర్తి సురేష్ తను చేసిన గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా సినిమాల కోసం సన్నబడ్డది. మహానటి కోసం కొద్దిగా బరువు పెరిగిన కీర్తి సురేష్ మిస్ ఇండియా సినిమా కోసం సన్నబడ్డది. అయితే సన్నబడ్డ కీర్తి సురేష్ ను చూసి ఆమె ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు. కీర్తి సురేష్ బొద్దుగా ఉంటేనే ముద్దుగా ఉంటుందని అంటున్నారు. అయితే తన ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేయడం ఇష్టం లేని అమ్మడు మళ్లీ తన మునుపటి రూపాన్ని తెచ్చుకుంటుంది.
తెలుగులో ప్రస్తుతం నితిన్ సరసన రంగ్ దే సినిమా చేస్తున్న కీర్తి సురేష్. తర్వాత సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాల్లో కీర్తి తన మునుపటి రూపంతోనే కనిపిస్తుందని తెలుస్తుంది. సినిమాల్లో పాత్రల కోసం హీరోలు.. హీరోయిన్స్ తమ బాడీలో మార్పులు చేసుకోవడం సహజమే. ఇక లేటెస్ట్ గా కీర్తి సురేష్ కూడా మరోసారి తన మునుపటి రూపంతో ఫ్యాన్స్ ను అలరించనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి