ఇకపోతే ఈ తాజా సీజన్లో గంగవ్వ కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. వయసు మీద పడ్డప్పటికి కూడా ఈ షోలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా ప్రవేశించిన గంగవ్వ ఆ తర్వాత కొన్ని రోజుల అనంతరం అనారోగ్య కారణాల వల్ల షో నుండి మధ్యలోనే నిష్క్రమించడం జరిగింది. హౌస్ లో తాను మరికొన్నాళ్లు కొనసాగితే ఆరోగ్యం మరింతగా ఇబ్బందుల్లో పడుతుందని భావించిన నాగార్జున అలానే బిగ్ బాస్ ఇద్దరు కూడా ఆమెకు ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చి బయటికి పంపించడం జరిగింది.
అయితే ఆ సమయంలో గంగవ్వ ఆటతీరు కి మంచి మనసుకి మెచ్చిన బిగ్ బాస్ ,ఆమె చిరకాల వాంఛ అయిన సొంతింటి కలని తీర్చి, ప్రత్యేకంగా ఇల్లు కట్టించేందుకు కొంత డబ్బు కేటాయిస్తానని మాట ఇచ్చారు. ఇప్పటికే ఆ ఇంటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ పూర్తయిందని అతి త్వరలో ఇంటి యొక్క పునాదులు మొదలవుతాయని సమాచారం. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారాన్ని బట్టి ఆ ఇంటి యొక్క ఖర్చులో కొంత భాగాన్ని కింగ్ నాగార్జున గారు కూడా భరిస్తున్నారని, గంగవ్వ వంటి మంచి వ్యక్తికి తన వంతుగా సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె రాబోయే రోజుల్లో మరింత ఆరోగ్యంగా ఉండి తన మాటలతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవాలని కోరుతూ నాగార్జున ఇటీవల ఆమెకు కొంత డబ్బు కూడా పంపినట్లు సమాచారం. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ తాజా బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గంగవ్వ కు మరింత మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయని చెప్పాలి.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి