ప్రస్తుతం అల్లుఅర్జున్ యాక్ట్ చేస్తున్న  సినిమాకు దర్శకుడు. ఇంకా కాస్త కన్ఫ్యూ జన్ గానే ఉందా...ఈయన మరెవరో కాదండీ మన ప్రియతమ దర్శకుడు సుకుమార్. టాలీవుడ్‌లో ఫుల్ జోష్ తో దూసుకుపోతున్న  సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఆర్య సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ దర్శకుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తు సంపాదించుకున్నారు. డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇండస్ట్రీకి రాకముందు లెక్కల మాస్టర్ గా పనిచేసేవారు అని చాలా మందికి తెలియక పోవచ్చు.

ఆర్య సినిమాతోనే విజయం అందుకున్న ఈ దర్శకుడు ఆర్య 2 కి ఆ హైప్ తెచ్చుకోలేక పోయినప్పటికీ..విభిన్న కథా దర్శకుడిగా ప్రశంసలు పొందారు. రంగస్థలము సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ని బయటపెట్టారు దర్శకుడు సుక్కు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కోలాహలం చేసిందో తెలిసిన విషయమే.  ఇక ఎన్ టి ఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాతో తనలోని స్మార్ట్ థింకింగ్ పవర్ ని బయటపెట్టాడు ఈ ఇంటెలిజెంట్ దర్శకుడు. ప్రస్తుతం
టాలీవుడ్‌ మెగా హీరో  అల్లు అర్జున్‌ తో పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్.

రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ మన స్టైలిష్‌ స్టార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న మరో క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్ప అనే లారీ డ్రైవర్‌ పాత్రలో మాస్ లుక్ లో  కనిపించనున్నారు అల్లు అర్జున్‌. తన కెరియర్ లోనే పక్కా మాస్ లుక్ తో కనిపించనున్న మొట్టమొదటి సినిమా పుష్ప. ఇప్పటికే విడుదలైన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. మాస్ డైరెక్టర్ గా మారితే నా లెక్క వేరే ఉంటుందని నిరూపించిన దర్శకుడు సుకుమార్ కు ఈ సినిమా మరో ప్లస్ కాబోతుందని చెబుతున్నాయి సినీ వర్గాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: