పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తను ఏ సినిమా చేసినా సూపర్ హిట్ అనిపించుకున్న డైరక్టర్ అనీల్ రావిపుడి ప్రస్తుతం F3 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సూపర్ హిట్ మూవీ F2కి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడం పక్కా అనేస్తున్నాడు అనీల్ రావిపుడి. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ లిస్ట్ లో చాలామంది హీరోలే ఉన్నారు. అనీల్ తో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే అనీల్ రావిపుడి సినిమా ఆఫర్ వస్తే మాత్రం నో అనే ఛాన్స్ లేదు.

F3 తర్వాత ఇస్మార్ట్ హీరోతో అనీల్ రావిపుడి సినిమా ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ రామ్ తో అనీల్ రావిపుడి రాజా ది గ్రేట్ సినిమా చేయాల్సి ఉంది కాని అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఆ సినిమా నుండి రాం తప్పుకున్నాడు. రామ్ చేయాల్సిన రాజా ది గ్రేట్ సినిమా రవితేజతో చేసి హిట్ కొట్టాడు అనీల్ రావిపుడి. ఇక లేటెస్ట్ గా ఎఫ్3 తర్వాత అనీల్ రావిపుడి రామ్ తోనే సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్టే అంటున్నారు.

రెడ్ తో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్న రామ్ తన నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నాడు. ట్రాక్ ఎక్కిన తన కెరియర్ ను సెట్ రైట్ చేసుకునేందుకు ఇదే మంచి టైం అని ఫిక్స్ అయ్యాడు. అందుకే త్రివిక్రం తో కూడా సినిమా లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది. మాటల మాంత్రికుడితో రామ్ సినిమా అంటే తప్పకుండా ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.                

మరింత సమాచారం తెలుసుకోండి: