రికార్డులు క్రియేట్‌ చేసిన కెజిఎఫ్‌ 2 టీజర్ కాంట్రవర్సీ అయింది. హీరో యశ్‌తో సహా చిత్ర యూనిట్‌కు నోటీసులు పంపించారు. మాస్టర్‌లో విలన్‌గా నటించి  చెరగని ముద్ర వేసిన విజయ్‌ సేతుపతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో.. స్పందించిన విజయ్‌ క్షమాపణలు చెప్పి మళ్లీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడతానని మాటిచ్చాడు.

కెజిఎఫ్‌2 టీజర్‌ అంతా ఒక ఎత్తయితే.. చివర్లో గన్‌ బారెల్‌తో సిగరెట్‌ ముట్టించడం మరో ఎత్తు. టీజర్‌ వారంలో 150 మిలియన్‌ వ్యూవ్స్‌.. 7 మిలియన్‌ లైక్స్‌ సొంతం చేసుకుందంటే.. మెయిన్‌ రీజన్‌ ఈ ఒక్కసేనే.  అయితే.. ఈ సన్నివేశానికి కర్ణాటక యాంటీ టొకబాకో సెల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. యశ్‌తోపాటు చిత్ర యూనిట్‌కు నోటీసులు పంపాయి.

కెజిఎఫ్‌2లో సిగరెట్‌ సీన్‌ వచ్చినప్పుడు 'మద్యపానం.. ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని వేయడం  విస్మరించారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ.. యాంటీ టొబాకో సెల్‌ అధికారులు నటీసులు పంపిస్తూ.. టీజర్‌ నుంచి ఈ సీన్‌ తొలగించాలని కోరారు.

తమిళ నటుడు విజయ్‌సేతుపతి అనుకోకుండా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. విజయ్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ ఖడ్గంతో కేక్‌ కట్‌ చేయించగా నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ‘గతంలో కొందరు సంఘవిద్రోహశక్తులు ఇలాగే చేస్తే.. పోలీసులు అరెస్టు చేశారు. మరి ప్రముఖుల విషయంలో ఆ న్యాయం వర్తించదా..?’అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై నటుడు విజయ్‌ వివరణ ఇవ్వడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పాడు. సినిమాలో ఖడ్గం  ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేయడంతో.. యూనిట్‌ సభ్యులు అలా కేక్‌ కట్ చేయించారని.. ఎవరినైనా బాధపెడితే.. క్షమించడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విజయ్‌ సేతుపతి. దీంతో.. ఈ వివాదానికి తెరపడింది.

మొత్తానికి యశ్.. విజయ్ సేతుపతి వివాదాల్లోకి వచ్చేశారు. కెజిఎఫ్‌ 2 టీజర్‌ కాంట్రవర్సీ కావడమే అందుకు ప్రధాన కారణం. టీజర్‌లో హైలైట్‌గా యశ్‌ సిగరెట్‌ సీన్ రావడాన్ని సినీ అభిమానులు జీర్ణించకోలేకపోయారు. ‌









మరింత సమాచారం తెలుసుకోండి: