కేజీ ఎఫ్ 2’ టీజర్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు క్రియేట్ చేయడంతో ఈమూవీ పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. దీనితో ఈమూవీ రైట్స్ కోసం చాల పోటీ ఏర్పడింది. తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ హక్కుల కోసం తెలుగురాష్ట్రాలలో బయ్యర్లు రంగంలోకి దిగి 50 నుంచి 60 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు టాక్.


అయితే ‘కేజీ ఎఫ్’ నిర్మాతలు మటుకు 80 కోట్లు అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ బయ్యర్లు ఒక డబ్బింగ్ సినిమాకు 80 కోట్లు ఇవ్వవలసి వస్తే ‘ఆర్ ఆర్ ఆర్’ కు 150 కోట్లు ఇవ్వవలసి వస్తుందేమో అని వెనుకడుగు వేస్తున్నట్లు లీకులు వస్తున్నాయి.


ఈపరిస్థితిని గ్రహించిన ‘కేజీ ఎఫ్’ నిర్మాతలు దిల్ రాజ్ ను కాంటాక్ట్ లోకి తీసుకుని తాము కోట్ చేస్తున్న 80 కోట్లకు ‘కేజీ ఎఫ్ 2’ ను తీసుకుని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తే ఒకవేళ అనుకోకుండా నష్టం వస్తే ఆనష్టాన్ని పూరిస్తాము అని చెపుతున్నట్లు తెలుస్తోంది. అయితే దిల్ రాజ్ ఇలాంటి ఎగ్రిమెంట్ కు ఒప్పుకుని ‘కేజీ ఎఫ్ 2’ రైట్స్ ను అంత భారీస్థాయి మొత్తానికి తీసుకుంటే భవిష్యత్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలు కూడ ఆమూవీ రైట్స్ ను అత్యంత భారీ స్థాయికి కోట్ చేసి వారు కూడ నష్టం వస్తే ఆ నష్టం సద్దుబాటు చేస్తాము అన్న మాటలను మొదలుపెడితే భవిష్యత్ లో భారీ సినిమాలు అన్నీ ఇలాంటి బేరసారాలు మొదలు పెడితే అసలకు మోసం వస్తుందని దిల్ రాజ్ భయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.


ఇది ఇలా ఉంటే ‘కేజీ ఎఫ్ 2’ ఎంత స్థాయిలో బిజినెస్ చేయగలిగితే డానికి రెట్టింపు స్థాయిలో తమ ‘ఆర్ ఆర్ ఆర్’ బిజినెస్ అవుతుందని రాజమౌళి అంచనా అని అంటున్నారు. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతున్న అక్టోబర్ 8న  భారీ అంచనాలు ఉన్న హాలీవుడ్ మూవీ ‘నో టైమ్ టు డై’ విడుదల అవుతున్న పరిస్థితులలో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలు చెప్పే భారీ రేట్లకు ఆమూవీని అక్టోబర్ 8న విడుదల చేయడానికి బయ్యర్లు ఒప్పుకోరు  అందుకే ఆర్.ఆర్.ఆర్ ను అక్టోబర్ 13 న విడుదల చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: