దాదాపు టాప్ హీరోలందరితో ఆమె పనిచేశారు. బావ, శక్తి , సన్నాఫ్ సత్యమూర్తి , టెంపర్, డిక్టేటర్, ఆరెంజ్, రేసుగుర్రం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాల్లో హీరోలకు తల్లిగా చేసింది. ఈ నేపథ్యంలో ఆమెకు టాలీవుడ్ లో డిమాండ్ ఎక్కువయింది. అయితే రామ్ రెడ్ సినిమా తర్వాత ఆమె గురించి సెర్చ్ ఎక్కువయ్యింది.. దాంతో ఆమె గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. పవిత్ర లోకేష్ గారి తండ్రి మైసూర్ లోకేష్ ఆయన కూడా కన్నడలో ఆర్టిస్ట్ సినిమాల్లోనే కాకుండా ఆయన స్టేజి ఆర్టిస్ట్ కూడా అలాగే పవిత్ర లోకేష్ గారి బ్రదర్ అయినా ఆది లోకేష్ కూడా నటుడే, ఆమె భర్త కూడా నటుడే పవిత్ర లోకేష్ కాకుండా వాళ్ల కుటుంబం మొత్తం సినిమాకు సంబంధించిన వారే కావడం విశేషం.
పవిత్ర లోకేష్ గారి స్పెషాలిటీ ఏమిటంటే ఆమె యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలకు కూడా అమ్మ అని చెప్తే నమ్మేస్తారు. అందుకే ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలో ఆవిడే అమ్మ పాత్రలు చేస్తుంది.ఆవిడ ప్రతి ఎక్స్ప్రెషన్ ని ఈజీగా పండిస్తుంది. సెంటిమెంట్ సీన్లలో అయితే ఆమె నిజంగానే ఏడుస్తుందా అని ప్రేక్షకుడు అనుకునేటట్టుగా ఆ పాత్రలో జీవించేస్తుంది.అయితే ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన రాధిక,దేవయాని, సితార లాంటి ఆర్టిస్టులు కూడా తల్లిగా చేస్తున్నప్పటికీ చాలా సినిమాల్లో పవిత్ర లోకేష్ గారిని ఎక్కువ తల్లి పాత్రలకు తీసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి