రభస, అత్తారింటికి దారేది, హలో వంటి ప్రముఖ చిత్రాలలో సెకండ్ హీరోయిన్ పాత్రలను చేసి ఫస్ట్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గకుండా ప్రతిభ కనబరిచింది. అయితే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా క్లిక్ కాలేక పోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తోంది. అక్కడ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ఆకాంక్షించిన ప్రణీతకు ఒక గొప్ప అవకాశం లభించిందట. అజయ్ దేవగన్ హీరోగా నటించబోతున్న ఒక సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు ప్రణీత. ఈ సినిమాతో హిందీలో వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోవాలి అనుకుంటున్న ప్రణీత తన లుక్ ను కూడా మార్చేసిందట.
అయితే అది ఆమె చేస్తున్న హిందీ సినిమా కోసమట. ఆ సినిమాలో రెండు పాత్రలను పోషించనున్న ప్రణీత ఓ పాత్ర కోసం తన బరువును భారీగా పెంచుతోందట.... మరి ఇంత ప్రయోగం చేస్తున్న ఈ భామకు బాలీవుడ్ లో ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి. ఇప్పటి వరకు హీరోయిన్లు బాలీవుడ్ లో చేసి టాలీవుడ్ కి వచ్చిన వారే ఎక్కువ, కానీ ప్రణీత తెలుగులో చేసిన తరువాత బాలీవుడ్ కి వెళుతోంది మరి అక్కడైనా ఈమె మంచి హీరోయిన్ గా నిలబడుతుందా చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి