ప్రస్తుతం వేణు
శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్
సినిమా చేస్తున్న
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దాని తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్
సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ
నిర్మాత ఏఎం రత్నం మెగా
సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్
ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇక తొలిసారిగా
పవర్ స్టార్ తో చేస్తున్న
సినిమా కావడంతో దర్శకుడు క్రిష్ ఈ
మూవీ యొక్క కథ కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇందులో
పవన్ కళ్యాణ్ ఒక వజ్రాల
దొంగ పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. నిజాం నవాబుల కాలం నాటి కథగా ఎంతో అద్భుతంగా ఈ
సినిమా రూపుదిద్దుకుంటుందని అలానే ఇందులో
హీరోయిన్ గా
నిధి అగర్వాల్ నటిస్తుండగా బుల్లితెర సంచలన నటి
అనసూయ భరద్వాజ్ ఇందులో ముఖ్య పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ
సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమాలో
పవన్ తో పాటు
హీరోయిన్ నిధి అగర్వాల్ పాత్ర కూడా అదిరిపోతుందని అలానే ఇందులో సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటాయని అంటున్నారు.
ఇక ఈ
మూవీ కోసం ప్రత్యేకంగా సాంగ్స్ విషయమై ఎంతో శ్రద్ధ కనబరుస్తూ
సంగీత దర్శకుడు
కీరవాణి ట్యూన్స్ సిద్ధం చేశారని, మొత్తంగా ఐదు పాటలు ఉండే ఈ
సినిమా ఆడియో రిలీజ్ తర్వాత శ్రోతలను సాంగ్స్ ఎంతో ఆకట్టుకుంటాయని అంటున్నారు. తొలిసారిగా
పవర్ స్టార్ తో చేస్తున్న
సినిమా కావడంతో
కీరవాణి కూడా దీనిపై మరింత శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. అలానే సినిమాలోని కీలక సన్నివేశాల్లో ఆయన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుందని, మొత్తంగా రిలీజ్ తర్వాత ఈ
మూవీ మ్యూజికల్ గా కూడా భారీ
సక్సెస్ ని అందుకోవడం ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఒకదాని వెంట ఒకటి సినిమాలు చేస్తూ వేగవంతంగా ముందుకు సాగుతున్న
పవర్ స్టార్, ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమాతో మరొక
సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ తమ సోషల్
మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!