ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న పుష్ప సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, సుకుమార్ ఎవరు ఊహించని ఈ కాంబోతో షాక్ ఇచ్చారు. ఈ సినిమా నుండి ఓ అప్డేట్ రొడీ ఫ్యాన్స్ ను నిరాశపరచింది. సుకుమార్ పుష్ప సినిమా ఆగష్టు 13న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం రేయిబవళ్లు కష్టపడుతున్న సుక్కు పుష్ప తర్వాత కనీసం ఆరు నెలలు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాడట.
పుష్ప సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సినిమాకు సుకుమార్ ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు లైన్ మాత్రమే ఓకే చేయగా ఈ సినిమా ఫుల్ స్క్రిప్ట్ కోసం కొంత టైం తీసుకుంటారట. అంతేకాదు ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంచనాలను మించి సినిమా ఉండేలా చూస్తున్నారట. తప్పకుండా పుష్పతో సుక్కు తన స్టామినా చూపించి విజయ్ దేవరకొండ సినిమాతో అదిరిపోయే హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని తెలుస్తుంది. విజయ్ కూడా సుకుమార్ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి